మోజో లాంచ్ ఖరారు; 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల
ఈ బైక్‌ను గుర్తు పట్టారా..? అదేనండి మహీంద్రా మోజో.. మహీంద్రా టూవీలర్స్ అప్పుడెప్పుడో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 300సీసీ బైక్ ఇది. వాస్తవానికి ఈ బైక్ ఎప్పుడో మార్కెట్లోకి రావల్సి ఉంది. కానీ, ఈ బైక్‌ను వాణిజ్య పరంగా విడుదల చేయటంలో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దీని విడుదల జాప్యమవుతూ వస్తోంది.
అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా మోజో బైక్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2014 అంతర్జాతీయ ఆటోమొబైల్ ప్రదర్శనలో మహీంద్రా టూవీలర్స్ సరికొత్త మోజో బైక్‌ను విడుదల చేయనున్న అధికారికంగా ధృవీకరించింది.
ఇది కూడా చదవండి.. రీడిజైన్డ్ మహీంద్రా మోజో బైక్
ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్, ప్రెసిడెంట్ (టూవీలర్ బిజినెస్) అనూప్ మాథుర్ మాట్లాడుతూ.. అందరిచేత 'వావ్' అనిపించేలా తమ మోజో బైక్ ఉండబోతుందని, గతంలో చూపించిన మోజో కాన్సెప్ట్ బైక్ కన్నా (ఈ ఫొటోలో కనిపిస్తున్న దాని కన్నా) భిన్నంగా, విశిష్టంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
మహీంద్రా మోజో బైక్ విడుదలతో సరిపెట్టుకోకుండా, 2016వ సంవత్సరం వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున ఒక కొత్త మోడల్‌ను విడుదల చేస్తామని, ఇవి సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనున్నాయని ఆయన వివరించారు. మహీంద్రా మోజోను స్థానికంగానే అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, ఇది సరసమైన ధరకే అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో మాదిరిగానే మహీంద్రా కూడా విదేశీ భాగస్వాములతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాథుర్ తెలిపారు.


Click it and Unblock the Notifications









