మహీంద్రా సెంచురోకు మూడు వారాల్లో 10,000 బుకింగ్స్
యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం, మహీంద్రా టూవీలర్స్ ఈ నెల ఆరంభంలో ప్రవేశపెట్టిన చీప్ అండ్ బెస్ట్ 110సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా సెంచురో' భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలైన మొదటి మూడు వారాల్లోనే 10,000 యూనిట్ల బుకింగ్‌లను సొంతం చేసుకుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా మహీంద్రా టూవీలర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీరెన్ పోప్లీ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే మహీంద్రా సెంచుకో 10,000 బుకింగ్‌లను దక్కించుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని, ఇదే సమయంలో వినియోగదారులు తమపై పెంచుకున్న అంచనాలకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
మహీంద్రా సెంచురో జులై 1, 2013న విడుదలైంది. దేశీయ విపణిలో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే, ప్రారంభ ఆఫర్‌లో భాగంగా మొదటి 10,000 మంది కస్టమర్లకు సెంచురోను కేవలం రూ.44,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకే విక్రయించారు. ఈ బైక్‌పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది.
మహీంద్రా సెంచురో బైక్‌లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









