జూన్ నెలలో మార్కెట్లోకి రానున్న 'వెస్పా 946' స్కూటర్
రూ.9 లక్షల స్కూటర్ 'వెస్పా 946' గుర్తుందా..? గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో ప్రదర్శనకు ఉంచిన ఈ లగ్జరీ స్కూటర్‌ను మరో రెండు-మూడు నెలల్లో మార్కెట్లో విడుదల చేస్తామని పియాజ్జియో గడచిన మార్చ్ నెలలో 'వెస్పా ఎస్125' స్కూటర్‌ను విడుదల చేసిన సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసినదే.
వెస్పా 946 స్కూటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఫొటోపై క్లిక్ చేయండి
కాగా.. పియాజ్జియో ఇప్పుడు తమ 'వెస్పా 946' (Vespa 946) స్కూటర్‌ను రానున్న జూన్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన ఈ హ్యాండ్-బిల్ట్ (చేతుల్తో తయారు చేసిన) స్కూటర్‌ను ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.
పియాజ్జియో గడచిన సంవత్సరం జూన్-జులై మధ్య కాలంలో వెస్పా 946 మోడల్‌ను ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. ఇది ఆషామాషీ స్కూటర్ కాదు. వెస్పా 946 ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ స్కూటర్‌ను తొలిసారిగా 2011లో జరిగిన మిలాన్ మోటార్ షోలో ఆవిష్కరించారు.
వెస్పా 946 లగ్జరీ స్కూటర్‌లో 4 స్ట్రోక్, 125 సీసీ, మోనో సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, 3 వాల్వ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఇంజన్ సొంతం. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న వెస్పా స్కూటర్లలో ఉపయోగించిన ఇంజన్ కన్నా ఇది భిన్నమైనది. ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఏఎస్ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద 12 ఇంచ్ వీల్స్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్‌తో ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా సురక్షితమైన స్కూటర్‌గా నిలువనుంది.


Click it and Unblock the Notifications









