టొయోటా వింగ్లెట్ పర్సనల్ మొబిలిటీ రోబోట్ ట్రైల్ రన్
సెగ్‌వే వాహనాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ సెల్ఫ్ బ్యాలెన్స్డ్ సెగ్‌వేల గురించి తెలుగు డ్రైవ్‍స్పార్క్ గతంలో ఓ కథనంలో ప్రచురించింది. ఇండోర్‌లో తక్కువదూరాలను చేరుకునేందుకు, పెద్ద ఆఫీస్ క్యాంపస్‌లలో నడవటానికి బదులుగా సులువుగా ప్రయాణించేందుకు ఈ సెగ్‌వేలను ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే పలు సంస్థలకు ఈ తరహా సెగ్‌వేలను మార్కెట్లో అందిస్తున్నాయి.
అయితే, సాంప్రదాయమై సెగ్‌వేలకు ఆధునికతను, సాంకేతికతను జోడించి టొయోటా ఓ సరికొత్త వాహనాన్ని అభివృద్ధి చేసింది. దీనిపేరే 'టొయోటా వింగ్లెట్' (Toyota Winglet). టొయోటా వింగ్లెట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. జపాన్‌లోని సుకుబా నగరంలో వీటిని టెస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ రోబోటిక్ సెగ్‌వే ఉత్పత్తి దశకు చేరుకోవటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.
టొయోటా వింగ్లెట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

పరిచయం
టొయోటా వింగ్లెట్‌ను తొలిసారిగా ఆగస్ట్ 2008లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు.

ట్రైల్ రన్
టొయోటా వింగ్లెట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. జపాన్‌లోని సుకుబా నగరంలో వీటిని టెస్ట్ చేస్తున్నారు.

వాస్తవానికి ఇదొక రోబోట్
పనితీరులో టొయోటా వింగ్లెట్ సాధారణ సెగ్‌వేల కన్నా భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి ఇదొక రోబోట్. దీని సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు.

లక్ష్యం
సురక్షితమైన, సులువుగా యాక్సెస్ చేయదగిన మరియు వినోదాలకు అనువైన మొబిలిటీని లక్ష్యంగా చేసుకొని వింగ్లెట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

భవిష్యత్తులో ఉపయోగం
భవిష్యత్తులో ప్రజల రవాణా ఉపయోగార్థం ఈ వాహనాన్ని రూపొందించారు. సేఫ్టీ, ఫంక్షనాలిటీ మరియు కన్వీనెస్స్ అంశాలను పరీక్షించేందుకు ప్రస్తుతం వింగ్లెట్‌ను టెస్టింగ్ నిర్వహిస్తున్నారు.

రేంజ్
ఈ ఎలక్ట్రిక్ వింగ్లెంట్ సింగిల్ ఛార్జ్‌పై సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. కేవలం ఒక్క గంటలోనే ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

టొయోటా వ్యాఖ్యలు..
ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఫంక్షనాలిటీ, కన్వీనెన్స్, సేఫ్టీ అంశాల్లో ఇది అన్ని విధాలుగా పర్‌ఫెక్ట్ అని నిర్ధారణ అయితే, దీనిని ఉత్పత్తి దశకు తీసుకువెళ్తామని టొయోటా మోటార్ కార్పోరేషన్ పేర్కొంది.

టొయోటా వింగ్లెట్
టొయోటా వింగ్లెట్ ఫ్రంట్ వ్యూ

టొయోటా వింగ్లెట్
టొయోటా వింగ్లెట్ సైడ్ వ్యూ
వీడియో
టొయోటా వింగ్లెట్ వీడియోను వీక్షించండి.


Click it and Unblock the Notifications








