కొత్త కలర్ ఆప్షన్లలో టీవీఎస్ ఫినిక్స్, అపాచే ఆర్‌టిఆర్ 160
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న 125సీసీ బైక్ టీవీఎస్ ఫినిక్స్, అలాగే పవర్‌ఫుల్ బైక్ అపాచే ఆర్‌టిఆర్ 160 మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్లను కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో, కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు, ఆకర్షనీయమైన కలర్లతో కూడిన బైక్‌లను టీవీఎస్ ప్రవేశపెట్టింది.
ఇది కూడా చదవండి: టీవీఎస్ ఫినిక్స్ 125 రివ్యూ
ఇప్పుడు టీవీఎస్ ఫినిక్స్ 125 కొత్త 'ఆల్పైన్ వైట్' అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌తో పాటుగా ప్రత్యేక స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. అలాగే, కొత్త అపాచే ఆర్‌టిఆర్ 16 బైక్ ఇప్పుడు సింగిల్ టోన్ కలర్‌వో టైటానియం గ్రే, రెడ్, యల్లో, బ్లాక్, వైట్ అనే ఐదు రంగులలో, కార్బన్ ఫైబర్ టెక్చర్‌తో లభిస్తుంది. ఈ రెండు బైక్‌లలో యాంత్రికపరమైన మార్పులు లేవు.

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్. ప్రీమియం బైక్‌లలో ఉండే ఫీచర్లు, శక్తిమంతమైన ఈకోథ్రస్ట్ ఇంజన్‌తో టీవీఎస్ ఫినిక్స్‌ను రూపొందించారు. ఇందులో అమర్చిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.



Click it and Unblock the Notifications








