మనోరంజనకరమైన మారుతి స్విఫ్ట్ న్యూ జనరేషన్

ఇప్పటి వరకు మారుతి నూతన స్విఫ్ట్ ఎన్నో రకాలుగా అతి రహస్యంగా ఆన్‌లైన్‌‌లో విడుదలవుతూ వచ్చింది. అయితే ఈ సారి రహస్యంగా కాకుండా అసలైన డిజైన్ రూపంలో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

By Anil

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ ఆరు సంవత్సరాల క్రితం నాటిది. అయితే ఇప్పుడు మారుతి తమ స్విఫ్ట్‌ను న్యూ జనరేషన్‌లో విడుదల చేసే పనిలో నిమగ్నమయ్యింది. నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 2017 నాటికి దేశీయ విపణిలోకి విడుదలకానుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

కొత్తగా విడుదలైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటో కొత్త డిజైన్ భాషను పరిచయం అయ్యింది. మునుపటి కన్నా కాస్త షార్ప్ డిజైన్‌లో కోణీయాకృతిలో తెగ సందడి చేస్తోంది.ముందు వైపున్న హెక్సా గోనల్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టివ్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

దీని ఫ్రంట్ డిజైన్ జాగ్వార్ ఐ-ఫేస్ ప్రొఫైల్‌ను పోలి ఉంది. ఇది పొడవు మరియు వెడల్పు పరంగా గత స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కన్నా ఎక్కువ పరిమాణంలో వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్ స్పేస్ కోసం బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా చెప్పుకునే స్విఫ్ట్ మరింత పెద్ద పరిమాణంలో వస్తే భారీ సక్సెస్ ఖాయం.

మారుతి సుజుకి స్విఫ్ట్

రహస్యంగా విడుదలైన ఫోటోలను పరిశీలిస్తే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, టిఎఫ్‌టి స్క్రీన్ కోసం డ్రైవ్ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే మరియు తాకే తెర పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రస్తుతం ఉన్న మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌‌బ్యాక్ లో ఉన్న ఫీచర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, న్యావిగేషన్, కనెక్టివిటి మరియు పార్కింగ్ సిస్టమ్ అసిస్టెన్స్ గల కెమెరా కలదు.

మారుతి సుజుకి స్విఫ్ట్

సరికొత్త స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో రానుంది, ఇవే ఇంజన్ వేరియంట్లు ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ లో కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి తమ స్విఫ్ట్ ను నెక్ట్స్ జనరేషన్ రూపంలో రానున్న స్విఫ్ట్ సాధారణ ఇంజన్ వేరియంట్లతో పాటు మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా రానుంది. మారుతి సుజుకి ఈ టెక్నాలజీని స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే పేరుతో వినియోగంలో ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

రహస్యంగా విడుదలైన ఫోటోల ప్రకారం ఇంటీరియరియర్ లోని ఫ్రంట్ క్యాబిన్ ను పరిశీలిస్తే ఆటోమేటిక్ డిఫరెన్షియల్ ను అనుసంధానం చేసే ఫీచర్ కలదు. తద్వారా డ్రైవ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సరికొత్త స్విఫ్ట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనపై స్పష్టత లేదు.

Via Ferd

మారుతి సుజుకి స్విఫ్ట్

  • ఇండియన్ ఇగ్నిస్ లో హైబ్రిడ్ టెక్నాలజీ
  • ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హైబ్రిడ్ కార్లు
  • మారుతి నుండి మరో శుభవార్త

Most Read Articles

English summary
New Maruti Suzuki Swift Photo Without Camouflage Leaked
Story first published: Friday, December 9, 2016, 8:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X