దేశీయంగా ఈ ఐదు ఉత్పత్తులతో ప్రారంభం కానున్న కియా మోటార్స్

By Anil

కియా మోటార్స్ గురించి గత వారం రోజుల నుండి ఆధారం లేని వార్తలు వస్తూనే ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్స్‌తో తోబుట్టువుగా ఉండే కియా మోటార్స్ నుండి లేదా హ్యుందాయ్ నుండి ఏ విధమైన అధికారిక సమాచారం లేదు. కాని ఇండియాలోకి తమ ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నద్దమవుతున్నట్లు స్పష్టం అవుతోంది.

అయితే కియా మోటార్స్ దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభిస్తే మొదటగా అందుబాటులోకి తీసుకువచ్చే ఐదు కార్ల గురించి క్రింది కథనంలో...

1. పికాంటో

1. పికాంటో

కియా వారి పికాంటో ఎంత చిన్నగా ఉంటుదో అంతే సౌకర్యవంతమైనది. ఇరుకైన మరియు అత్యంత ట్రాఫిక్ ఉన్న రోడ్ల మీదకు ఇది అచ్చంగా సరిపోతుంది. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ వారి ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే పా ఐ10 కారుకు రీప్లేస్ కానుందన్నమాట.

పికాంటో

పికాంటో

అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పికాంటోలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. మరి ఇండియన్ మార్కెట్ కోసం ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

2. రియో

2. రియో

కియా వారి రియో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం ఉన్న మారుతి వారి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు గట్టి పోటీగా నిలవనుంది.

రియో

రియో

పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లకు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ మరియు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స వంటి విభిన్నమైన ఫీచర్లకు కియా మోటార్స్ వారి రియో హ్యాచ్‍‌బ్యాక్ ఎంతో ప్రత్యేకం.

3. రియో సెడాన్

3. రియో సెడాన్

సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో దేశీయంగా గట్టి పోటీ ఉంది. ఈ సెగ్మెంట్లో మారుతి వారి స్విఫ్ట్ సెడాన్ అగ్రస్థానంలో ఉంది. దీనికి పోటీగా రియో సెడాన్ మంచి పనితీరు కనబరుస్తుందని ఆశాభావంతో ఉంది కియా. చాలా వరకు సంస్థలు ఈ సెగ్మెంట్లో తమ తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి.

రియో సెడాన్

రియో సెడాన్

ఇది కేవలం సబ్ నాలుగు మీటర్ల సెడాన్‌ మాదిరిగానే కాకుండా అత్యధిక బూట్ స్పేస్‌తో ఫుల్ సైజ్ సెడాన్‌గా కూడా ఉంటుంది. ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. ఇది దేశీయంగా అందుబాటులోకి వస్తే టయోటా ఎటియోస్, రెనో స్కాలా మరియు నిస్సాన్ సన్నీలకు గట్టి పోటీగా నిలవనుంది.

4. కరెన్స్

4. కరెన్స్

హ్యుందాయ్ మోటార్స్ ఎప్పటి నుండో దేశీయంగా ఎమ్‌పివి ని అందుబాటులోకి తేవాలని చూస్తోంది. అయితే తమ మిత్ర సంస్థ కియా మోటార్స్ తమ కరెన్స్ ఎమ్‌పివిని తీసుకురానుంది,.

కరెన్స్

కరెన్స్

ఏడు సీట్ల సామర్థ్యం ఉన్న కియా మోటార్స్ యొక్క కరెన్స్ ఎమ్‌పివి దేశీయంగా విడుదేలైతే రెనో లాజీ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి పోటీగా నిలవనుంది.

5. స్పోర్టేజ్

5. స్పోర్టేజ్

ఎస్‌యువిలతో విరాజిల్లుతోన్న ఇండియన్ ఆటోమొబైల్ రంగంలోకి కియా నుండి తప్పకుండా ఒక ఎస్‌యువి రానుంది. కియోలో ఉన్న స్పోర్టేజ్ ఇండియా వైపు అడుగులేసే అవకాశం ఉంది. ఈ ఎస్‌యువిలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు.

స్పోర్టేజ్

స్పోర్టేజ్

స్పోర్టేజ్ ఎస్‌యువిలోని ఇంజన్ 134బిహెచ్‌పి మరియు 183బిహెచ్‌పి అనే రెండు శ్రేణుల్లో పవర్ ఉత్పత్తి చేయును. ఇది ప్రస్తుతం మహీంద్రా వారి ఎక్స్‌యూవీ500 కు గట్టి పోటీగా నిలిచే అవకాశం ఉంది.

ఈ ఐదు కార్లతో కియా మోటార్స్ ఆరంగ్రేటం

కొత్తగా వస్తున్న కియా దెబ్బకు మారుతి చతికిలపడాల్సిందేనా ?

మేడిన్ ఇండియానే కాని వరల్డ్ వైడ్ వీటికున్న డిమాండే వేరు

Most Read Articles

English summary
5 Kia Cars That Should Come To India
Story first published: Friday, August 19, 2016, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X