2019 నాటికి డీజల్ ఇంజన్ స్థానంలోకి మిల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌లు: వోక్స్‌వ్యాగన్

చిన్న డీజల్ ఇంజన్‌ గల వేరియంట్లలో మధ్య స్థాయి హైబ్రిడ్ ఇంజన్‌లు వచ్చే అవకాశం ఉంది.

Written By:

ఇప్పటికే డీజల్ ఉద్గార కుంభకోణంలో ప్రపంచ వ్యాప్తందా తీవ్ర ఒత్తిడికి గురైన వోక్స్‌వ్యాగన్ రానున్న కాలంలో తమ లైనప్‌లో ఉన్న అన్ని డీజల్ ఇంజన్‌లను పరిమిత ఉద్గారాలను వెదజల్లే హైబ్రిడ్ ఇంజన్‌లతో భర్తీ చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఛీఫ్ ప్రాంక్ వెల్ష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ తమ పెట్రోల్ కార్లలో 48వి సామర్థ్యం ఉన్న మిల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. అయితే రానున్న కాలంలో చిన్న పరిమాణంలో ఉన్న డీజల్ ఇంజన్‌ల స్థానంలోకి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఉద్గార కుంభకోణాలకు భారీగా నష్టపోతున్న వాటిలో వోక్స్‌వ్యాగన్ ఒకటి మరియు వోక్స్‌వ్యాగన్ ఈ కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను కూడా ఎదుర్కుంటోంది. ఇంధన మైలేజ్‌కు సంభందించిన పరీక్షల్లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటోంది.

ప్రస్తుతం చిన్న డీజల్ కార్లు పెట్రోల్ కార్ల అమ్మకాలతో పోటీ పడలేకపోతున్నాయి. మరియు చిన్న డీజల్ కార్ల తయారీకి కూడా ఎక్కువ ఖర్చు అవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా చిన్న కార్లకు స్వల్పంగా డిమాండ్ ఉన్నప్పటికీ డీజల్ కార్ల మీద ఆ ఆసక్తి ఉండటం లేదు మరియు తక్కువ లాభాలు ఎక్కువ ఖర్చు నేపథ్యంలో చాలా వరకు సంస్థలు పెట్రోల్ కార్ల ఉత్పత్తికే మొగ్గు చూపుతున్నాయి.

ఈ తరుణంలో ప్రపంచ మార్కెట్లో చిన్న డీజల్ కార్లకు ఉన్న మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి హైబ్రిడ్ పరిజ్ఞానం గల చిన్న కార్లు ఎంతగానో సహకరించనున్నాయని ఫ్రాంక్ వెల్ష్ అభిప్రాయపడ్డాడు.

అదే విధంగా ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజల కార్లకు మధ్య ధర వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంధన ధరలు, ఉద్గార నియమాలు, డీజల్ వాహనాల నిర్వహణ వంటి అనేక కారణాల చేత కార్లను ఎంపికి చేసుకునే వారు పెట్రోల్ మరియు హైబ్రిడ్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో వేరియంట్‌కు అంతర్జాతీయంగా భారీ ఫ్యాన్స్ ఉన్నట్లు ఆయన తెలిపాడు. అయితే ఇదే ధోరణి భవిష్యత్తులో కొనసాగే అవకాశం లేదని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.

చిన్న డీజల్ ఇంజన్‌కు బదులుగా వినియోగించనున్న 48వి బ్యాటరీ ఆధారిత సిస్టమ్ సైలెంట్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది. కారు ఆన్ అయ్యిందనే అనుమానం కలగడం ఖచ్చితంగా ఖాయం.

డీజల్ ఇంజన్‌లతో పోల్చితే ఉద్గారాలను కూడా చాలా తక్కువ మోతాదులో విడుదలవుతాయి మరియు మైలేజ్ పెరగడమే కాకుండా హైబ్రిడ్ వాహనాల కొనుగోలు ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి ఫలాలను కూడా పొందవచ్చు.

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Mild Hybrids Will Replace Small Diesel Engines By 2019
Please Wait while comments are loading...

Latest Photos