ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మైక్రాను పరిచయం చేయనున్న నిస్సాన్

By Anil

నిస్సాన్ కార్ల సంస్థ అతి త్వరలో ప్రారంభం కానున్న 2016 ప్యారిస్ మోటార్ షో లో తమ తరువాత తరం మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ ను ప్రదర్శించనుంది. గతంలో నిస్సాన్ ఈ మైక్రాను అత్యంత రహస్యంగా పరీక్షించారు. ఈ మైక్రాను 2015 లో జరిగిన జెనీవా మోటార్ షో లో కూడా ప్రదర్శించారు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

ప్రస్తుతం నిస్సాన్ దేశీయంగా అందుబాటులో ఉంచిన మైక్రా డిజైన్‌తో పోల్చుకుంటే ఈ నెక్ట్స్ జనరేషన్ చాలా విభిన్నమైన డిజైన్‌లో కలదు. ముందు వైపు డిజైన్ పూర్తిగా స్పోర్టివ్ లక్షణాలను పోలి ఉంది. భవిష్యత్ తరాల డిజైన్‌కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

ప్రక్క మరియు వెనుక వైపున బాడీ మీద వాలుగా ఉండే విధంగా డిజైన్ గీతలను అందించారు. వెనుక వైపున నూతనత్వానికి ఏ మాత్రం తీసిపోకుండా ఆకర్షణీయమైన స్పోర్టివ్ స్పాయిలర్‌ను కూడా అందించారు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

జపాన్‌కు చెందిన నిస్సాన్ అభివృద్ది చేస్తున్న ఈ తరువాత తరం మైక్రా హ్యాచ్‌బ్యాక్‌కు సంభందించిన ఏవిధమైన సాంకేతిక వివరాలు వెల్లడి కాలేదు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

రెనో మరియు నిస్సాన్ సంయుక్త భాగస్వామ్యంతో కార్లను అభివృద్ది చేస్తున్న సిఎమ్‌ఎఫ్ వేదిక మీద ఈ నెక్ట్స్ జనరేషన్ మైక్రాను అభివృద్ది చేయనున్నారు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

నిస్సాన్ ఈ మైక్రాను ఫ్రాన్స్‌లోని రెనో ఉత్పత్తి ప్లాంటులో ప్రొడక్షన్ చేయనున్నారు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

నిస్సాన్ ఈ తరువాత తరం మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసే విషయమై ఏ విధమైన సమచారం ఇవ్వలేదు.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

ఇండియన్ మార్కెట్లోకి అత్యంత సరసమైన ఉత్పత్తులను అందివ్వాలనే లక్ష్యంతో నిస్సాన్ ఉంది కాబట్టి ఈ మైక్రాను వి ప్లాట్‌మీద రూపొందించి దేశీయ విపణిలోకి అందించే అవకాశం ఉంది.

తరువాత తరం నిస్సాన్ మైక్రా

  • రికార్డ్ సృష్టించిన హోండా సిబి షైన్ ఎస్‌పి

Most Read Articles

English summary
Read In Telugu: Next-Gen Nissan Micra To Be Showcased At Paris Motor Show 2016
Story first published: Tuesday, September 20, 2016, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X