ధరల పెంపు బాటలో నిస్సాన్ మరియు డాట్సన్

నిస్సాన్ మరియు డాట్సన్ దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల మీద ధరల పెంపును ప్రకటించాయి.

Written By:

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ అధికారికంగా ధరల పెంపును ప్రకటించింది. దేశ వ్యాప్తంగా తమ లైనప్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల మీద పెంచిన ధరలు జనవరి 2017 నుండి అమల్లోకి రానున్నాయి.

పెట్టుబడి ఖర్చులు పెరగడం వలన డాట్సన్ మరియు నిస్సాన్ వారి ఉత్పత్తుల మీద దేశ ధరలను పెంచినట్లు ఆ రెండు సంస్థలు అధికారికంగా స్పష్టం చేశాయి.

పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏదాది జనవరి నుండి అమల్లోకి రానున్నాయి. నిస్సాన్ మరియు డాట్సన్ తమ శ్రేణిలోని ఉత్పత్తుల మీద గరిష్టంగా 30,000 రుపాయల వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, పెట్టుబడి ధర పెరగడం కారణంగా పెంపు చేపట్టామని, పోటీ దారులను ఎదుర్కునేందుకు ధరల సవరణ తక్కువ మొత్తంలోనే ఉన్నట్లు తెలిపాడు.

నిస్సాన్, డాట్సన్, హ్యుందాయ్, రెనో మరియు టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తుల మీద ధరలను పెంచాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Nissan India Announces Price Hike From January 2017
Please Wait while comments are loading...

Latest Photos