ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న నిస్సాన్

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ దేశీయ మార్కెట్లోకి ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఉన్న దిగ్గజ సంస్థల పోటీని తట్టుకోవడానికి రానున్న ఐదేళ్ల కాలంలో ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేసి తమ ప్రాబల్యాన్ని పెంచుకోనుంది.

నిస్సాన్ కొత్త కార్లు

2020 నాటికి దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ వాటాలో ఐదు శాతం సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకోసం నిస్సాన్ మరియు డాట్సన్ సంయుక్తంగా ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

నిస్సాన్ కొత్త కార్లు

నిస్సాన్ మోటార్ కం. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజ్‌మెంట్ కమిటీ, చైర్మెన్ ఆఫ్ ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మరియు ఇండియా విభాగాదిపతి క్రిస్టియన్ మాడ్రస్ ఈ సమాచారాన్ని వెల్లడించాడు.

నిస్సాన్ కొత్త కార్లు

నిస్సాన్ అంతర్జాతీయంగా ఎదగడానికి ఇండియా అతి ముఖ్యమైన మార్కెట్ అంటూ అభివర్ణించాడు.

నిస్సాన్ కొత్త కార్లు

ప్రపంచ దిగ్గజ కార్ల తయారీ సంస్థలు అన్ని కూడా దేశీయ మార్కెట్‌పై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్ 2021 నాటికి ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి నిర్ణయించినట్లు మాడ్రస్ తెలిపాడు.

నిస్సాన్ కొత్త కార్లు

వరుసగా అధిక ఉత్పత్తులను తన లైనప్‌లో ప్రవేశపెట్టడం ద్వారా దేశీయంగా శక్తివంతమైన కార్ల తయారీ సంస్థగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు.

నిస్సాన్ కొత్త కార్లు

దేశీయంగా విడుదల చేయనున్న ఉత్పత్తుల వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

నిస్సాన్ కొత్త కార్లు

ఇండియన్ మార్కెట్లోకి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిస్సాన్ తమ ఎక్స్‌-ట్రయల్ హైబ్రిడ్‌ ఎస్‌యువిని విడుదల చేయనుందని నిస్సాన్ ఇండియా ఆపరేషనల్ హెడ్ తెలిపాడు.

నిస్సాన్ కొత్త కార్లు

భవిష్యత్తులో విడుదల చేయనున్న ఉత్పత్తుల గురించి ఆరా తీయగా మార్కెట్ అవసరాలను బట్టి నూతన ఉత్పత్తుల విడుదల ఉంటుందని చెప్పుకొచ్చాడు.

నిస్సాన్ కొత్త కార్లు

  • ఐదు విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500
  • వీటిని కొనాలంటే ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిందే...!!
  • భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!

Most Read Articles

English summary
Read In Telugu: Nissan To Launch Eight New Products In India
Story first published: Saturday, October 8, 2016, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X