ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో నిస్సాన్ టెర్రానో విడుదల

నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలోకి ఎట్టకేలకు తమ టెర్రానో ఎస్‌యువిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో విడుదల చేసింది.

Written By:

నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలోకి తమ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యువిని ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో విడుదల చేసింది. నిస్సాన్ టెర్రానో ఏఎమ్‌టి ప్రారంభ వేరియంట్ ధర రూ. 13.75 లక్షలు ఎక్స్‌ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ ద్వారా అందుబాటులోకి వచ్చిన టెర్రానో కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.

నిస్సాన్ టెర్రానో ఆటోమేటిక్ ఎస్‌యువి 1.5-లీటర్ సామర్థ్యం గల కామన్ రెయిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 108.6బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

నిస్సాన్ టెర్రానోలోని ఆటోమేటిక్ వేరియంట్లోని ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా క్లచ్ సాయం లేకుండా వేగాన్ని బట్టి గేర్లను దానంతటదే మార్చుకుంటుంది.

నిస్సాన్ ఇండియా ఈ ప్రత్యేకమైన ఆటోమేటిక్ టెర్రానో ఎస్‌యువిని ప్రత్యేకమైన శాండ్‌స్టోన్ బ్రౌన్ రంగులో అందించిది. కేవలం ఈ రంగులో మాత్రమే ఏఎమ్‌టి టెర్రానో లభించును.

ప్రస్తుతం దేశీయ రహదారుల్లో ఉన్న సాధారణ టెర్రానో పోల్చినపుడు దీనిని గుర్చించడానికి ఆటోమేటిక్ అనే ప్రత్యేక చిహ్నాలు గల బ్యాడ్జింగ్‌లను అందించారు.

డిజైన్ పరంగా మునుపటి టెర్రానోతో పోల్చుకుంటే కాస్త పదునైన లక్షణాలను గుర్తించవచ్చు. ఇంటీరియర్‌లో సరికొత్త బీజి రంగులో ఉన్న అప్‌హోల్‌స్ట్రే మరియు లెథర్ సీట్లు కలవు.

ఇంటీరియర్ మొత్తం డిజైన్‌లో డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజి రంగుల కలయిక ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. టెర్రానో ఏఎమ్‌టి వేరియంట్ లగ్జరీ మరియు సౌకర్యానికి గురి చేస్తుంది.

రెనో డస్టర్ ఏఎమ్‌టి కన్నా నిస్సాన్ టెర్రానో ఏఎమ్‌టి ధర 78,000 రుపాయలు ఎక్కువగా ఉంది.

రెనో తమ డస్టర్ ఏఎమ్‌టిని సుమారుగా ఏడు నెలల క్రితం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పడు మార్కెట్లో వీటి అమ్మకాలు ఎలా ఉండనున్నాయి అనేది కాస్త ఆసక్తికరంగా మారింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu: Nissan India Launches The Terrano AMT At An Irresistible Price
Please Wait while comments are loading...

Latest Photos