భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

By Anil

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి హైబ్రిడ్ ఎస్‌యువిల సెగ్మెంట్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సెగ్మెంట్లోకి నిస్సాన్ సంస్థ తమ మొదటి హైబ్రిడ్ ఎస్‌యువి ఎక్స్-ట్రయల్‌మను విడుదల చేయనుంది. జపాన్‌కు చెందిన నిస్సాన్ ఈ ఎస్‌యువిని డిసెంబర్ 2016 లో దేశీయంగా విడుదల చేయనుంది.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

నిస్సాన్ మొదటి సారిగా ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. మరియు కొన్ని నెలల క్రితం దీనిని రహదారి పరీక్షల కోసం రోడ్డు మీదకు కూడా తీసుకువచ్చారు.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

నిస్సాన్ ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యుని పూర్తిగా కంప్లిట్లి బిల్ట్ యునిట్‌గా అందుబాటులోకి తీసుకురానుంది. మరియు అత్యంత ఆకర్షణీయమైన ధరలతో సుమారుగా 30 నుండి 35 లక్షల మధ్య శ్రేణిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

జపాన్‌కు చెందిన నిస్సాన్ తమ ఎక్స్-ట్రయల్‌ యొక్క ఉత్పత్తి విడుదల కోసం ఎదురు చూస్తున్న వాటిలో ఇండియా నాలుగవ మార్కెట్‌గా ఉంది.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

నిస్సాన్ సాంకేతికంగా ఇందులో 2.0-లీటర్ పెట్పోల్ ఇంజన్ మరియు దీనికి 32కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేయనుంది.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

ఇండియాకు రానున్న ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్‌లోని ఇంజన్‌కు ఎక్స్-ట్రానిక్ సివిటి గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు మరియు ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు అందుతుంది.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

ప్రస్తుతం విడుదలకు అన్ని కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేసుకుంటున్న ఎక్స్-ట్రయల్ ఎస్‌యువి నిస్సాన్ నాలుగవ తరానికి చెందినది. ఇది వరకే దీనిని 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో కూడా ప్రదర్శించబడింది.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

మునుపటి తరానికి చెందిన ఎస్‌యువితో పోల్చుకుంటే దీని క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. 5-సీటింగ్ సామర్థ్యంలో డిజైన్ చేయబడిన దీనిని సిఎన్ఎఫ్-సి ఫ్లాట్ ఫామ్ మీద అభివృద్ది చేశారు.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఇండియాకు కొత్త కాదు, మొదటి ఎక్స్-ట్రయల్‌ 2005 లో పరిచయం చేశారు మరియు 2014 వరకు అమ్మకాల్లో ఉంది. అదే తరహా ఫీచర్లతో హైబ్రిడ్ లక్షణాలతో మన ముందుకు ఈ ఏడాది డిసెంబర్‌లో రానుంది. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. మా కథనాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

భారత దేశపు హైబ్రిడ్‌ ఎస్‌యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్‌-ట్రయల్

  • మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ
  • ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు

Most Read Articles

English summary
India’s First Hybrid SUV Nissan X-Trail Launch Revealed
Story first published: Saturday, September 3, 2016, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X