రెనో క్విడ్‌లో లోపం, 50,000 కార్లు వెనక్కి: మీ కారు సేఫ్‌గా ఉందా ?

By Anil

ఫ్రాన్స్ మరియు జపనీస్ ఆటో భాగస్వామ్యం రెనో-నిస్సాన్ సంస్థలు దేశీయంగా సుమారుగా 51,000 ల తమ ఎంట్రీ లెవల్ కార్లను రీకాల్ చేసింది. రెనో ఇండియా 50,000 క్విడ్ కార్లను వెనక్కి పిలవగా డాట్సన్ 932 రెడి గో కార్లను వెనక్కి పిలిచింది.

రెనో క్విడ్ రీకాల్

రీకాల్‌కు గురైన క్విడ్ మరియు రెడి గో కార్లలో ఇంధన సరఫరా విభాగంలో ఉన్న లోపాన్ని గుర్తించడం మరియు హోస్ క్లిప్పులను జత చేయాల్సి ఉంటుంది.

రెనో క్విడ్ రీకాల్

సమస్య ఉన్నట్లు భావిస్తున్న ఉత్పత్తులకు ప్రాథమికంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రెనో ఇండియా తెలిపింది.

రెనో క్విడ్ రీకాల్

అక్టోబర్ 2015 నుండి మే 18, 2016 మధ్య ఉత్పత్తి అయిన 800సీసీ సామర్థ్యం గల క్విడ్ కార్లు రీకా‌ల్‌కు గురైనట్లు తెలిసింది.

రెనో క్విడ్ రీకాల్

రెనో ఇండియా రీకాల్ చేసిన యూనిట్ల మీద ప్రత్యేక చొరవ తీసుకుని అన్నింటిలోని ఇంధన సరఫరా వ్యవస్థను పరిశీలించి, లోపాన్ని గుర్తించి, పరిష్కరించి పూర్తి స్థాయిలో ఇంధన సరఫరా వ్యవస్థ యొక్క పనితీరును గమనించనున్నారు.

రెనో క్విడ్ రీకాల్

వినియోగదారులకు ఈ సమస్యను పూర్తి ఉచితంగా పరిష్కరించనున్నారు సంభందిత డీలర్లు.

రెనో క్విడ్ రీకాల్

ప్రస్తుతం రెనో ఇండియా రీకాల్ చేసిన కార్లను ఎంచుకున్న వినియోగదారులను గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతోంది. ఆ తరువాత కస్టమర్లను డీలర్ల వద్ద వారి కార్లకు ఉచిత సర్వీసింగ్ చేయించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

రెనో క్విడ్ రీకాల్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కారణంగా మంచి అమ్మకాలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంలో ఈ సమస్య గురించి ఏ విధమైన అదనపు సమాచారాన్ని అందివ్వలేదు. రీకాల్‌కు గురైన వాటిలో కేవలం 10 శాతం కార్లు మాత్రమే ఈ సమస్యకు గురయ్యాయని రెనో తెలిపింది.

రెనో క్విడ్ రీకాల్

రెనో ఇండియా తమ ఎంట్రీలెవల్ క్విడ్ కారును గత ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 800సీసీ సామర్థ్యం గల దీని ధర 2.64 నుండి 3.73 లక్షల మధ్య ఉండేది.

రెనో క్విడ్ రీకాల్

ఈ ఏడాది ఆగష్టు మాసంలో 1,000సీసీ సామర్థ్యం గల క్విడ్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ప్రారంభంలో దీని ధర రూ. 3.95 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉండేది.

రెనో క్విడ్ రీకాల్

నిస్సాన్ కూడా తమ భాగస్వామి అయిన డాట్సన్ అభివృద్ది చేసిన రెడి గో కార్లను 932 వరకు ఇదే కారణం చేత రీకాల్ చేసింది.

రెనో క్విడ్ రీకాల్

  • చైనాను భారత్ సంస్థలు ఈ మార్గంలో కూల్చనున్నాయా ?
  • భారత్ మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్ నుండి సరికొత్త హ్యాచ్‌బ్యాక్
  • సంచలనాత్మక విజయంలో టాటా టియాగో: భారీ బుకింగ్స్ కారణంగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu: Renault Kwid Recall Fuel Hose Clip Issue Voluntary Inspection
Story first published: Thursday, October 13, 2016, 13:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X