ఢిల్లీలో డీజల్ కార్లపై నిషేధాన్ని ఎత్తేసిన సుప్రీం కోర్టు
ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో 2000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ మీద విధించిన బ్యాన్ ను ఎత్తివేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

2000సీసీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో అందుబాటులో ఉన్న వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే ముందు పర్యావరణ పరిరక్షణ సెస్సు క్రింద 1 శాతం రుసుమును సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెరిచే ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత రసీదుతో సంభందిత ఆర్‌టిఒ కార్యాలయంలో యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
Also Read: ఎయిర్ ఫోర్స్ వన్ విమానం చారిత్రాత్మక విషయాలు
కారు యొక్క ఎక్స్ షోరూమ్ ధరలో ఒక శాతాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు చెంల్లిచాలి. అయితే లోకల్ ట్యాక్స్ మరియు ఇన్సూరెన్స్‌లకు ఇది మినహాయింపు. జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరియు టయోటా సంస్థలు రెండూ ఢిల్లీలో డీజల్ వాహనాల బ్యాన్‌కు చాలా నష్టపోయాయి.
Also Read: ఫ్యూచర్ మొత్తం ఎస్‌యువిలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు
ఈ రెండు సంస్థలు సంయుక్తంగా 1 శాతం ఎన్విరాంట్ ప్రొటెక్షన్ ట్యాక్స్ చెల్లిస్తామని పిటిషన్ దాఖలు చేసాయి. ఇందుకు అంగీకరించిన సుప్రీం కోర్ట్ బ్యాన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు డీజల్ వాహనాల బ్యాన్‌ను కొట్టివేసిన తరువాత కొన్ని ఆటోమొబైల్ సంస్థల షేర్లు అమాంతం పెరిగాయి.


Click it and Unblock the Notifications








