అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

By Anil

ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కార్లకు కేవలం దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి గిరాకీ లభిస్తోంది. తద్వారా తయారీ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌‌కు తమ ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా ఇండియా యొక్క సాంకేతిక మరియు తయారీ రంగాల శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి.

చాలా వరకు కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో తయారు చేసి, సులభంగా ఎగుమతి చేయవచ్చు అని నమ్ముతున్నాయి. అందుకు నిదర్శనం గత ఆర్థిక సంత్సరంలో పెరిగిన కార్ల ఎగుమతులే. ఇండియాలో తయారై అంతర్జాతీయ మార్కెట్‌కు ఎక్కువగా ఎగుమతువుతున్న ఐదు ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం రండి...

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ఇండియాలో ఉన్న మార్కెట్ వర్గాలకు మరియు వినియోగదారులకు మారుతి తరువాత ఉన్న పర్యాయ పదం హ్యుందాయ్. హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 ఇండియాతో పాటు విదేశాల్లో కూడా మంచి అమ్మకాలు సాధిస్తోంది. ఇతర దేశాల్లో అమ్ముడవుతున్న ఉత్పత్తుల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది ఈ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్.

అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

భారత దేశపు రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 44,000 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ 1197సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1120సీసీ సామర్థ్యం ఉన్న డీజల్‌ ఇంజన్‌తో అందుబాటులో ఉంది.

మారుతి ఆల్టో

మారుతి ఆల్టో

మారుతి వారి ఆల్టో ఎప్పటిలాగే ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలుస్తూనే, ఎగుమతుల్లో కూడా మంచి ఫలితాలను సాధిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 54,656 యూనిట్ల ఆల్టోలను మారుతి ఎగుమతి చేసింది. అంతకు మునుపటి ఆర్థిక ఏడాదితో పోల్చుకుంటే ఎగుమతుల్లో 70 శాతం వృద్ది పెరిగింది.

అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

మారుతి ఆల్టో లోని 800 వేరియంట్ 796 సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ అదే విధంగా ఆల్టో కె10 998సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో

వోక్స్‌వ్యాగన్ వెంటో

ప్రపంచాన్నే కుదిపేసిన డీజల్ ఉద్గాల పరీక్షల కుంభకోణం అనంతరం కూడా వోక్స్‌వ్యాగన్ భారీగా తమ కార్ల అమ్మకాలు జరిపింది. జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ గత ఐదు సంవత్సరాల నుండి తమ ఉత్పత్తులను ఇండియా నుండి ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తోంది.

అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో వోక్స్‌వ్యాగన్ సుమారుగా63,157 యూనిట్ల వెంటో కార్లను ఎగుమతి చేసింది. వెంటో సెడాన్‌వో ప్రస్తుతం 1.2-లీటర్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ అదే విధంగా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లలో లభిస్తోంది.

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ సంస్థ ఫ్రెంచ్‍‌కు చెందిన రెనోతో చేతులు కలిపి కొన్ని బడ్జెట్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అందులో మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఒకటి. కాని దేశీయంగా ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేదు, అయినప్పటికీ అంతర్జాతీయంగా మంచి అమ్మకాలను సాధిస్తోంది. నిస్సాన్ గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 75,456 యూనిట్ల మైక్రా కార్లను ఎగుమతి చేసింది. నిస్సాన్ ఈ మైక్రాను సుమారుగా 100 దేశాలకు పైగా ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది.

అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

నిస్సాన్ ఈ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అందిస్తోంది.

 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

అంతర్జాతీయ మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ గట్టి పోటీని ఎదుర్కుంటోంది, అయినప్పటికీ ఇండియా నుండి ఎగుమతి అవుతున్న వాటిలో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో 83,325 యూనిట్ల ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లు ఎగుమతి అయ్యాయి. అంతకు మునుపటి ఏడాదితో పోల్చుకుంటే ఎగుమతుల్లో 51 శాతం వృద్దిని సాధించింది.

అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న టాప్ 5 మేడిన్ ఇండియా కార్లు

ఎకోస్పోర్ట్ ఎస్‌యువిలో 1.0-లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు కలవు.

.

నిజజీవితపు సుల్తాన్: బంగారపు విమానాన్ని కలిగి ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?

Most Read Articles

English summary
Top 5 ‘Made In India’ Cars Sold Globally — India On Global Map
Story first published: Wednesday, August 17, 2016, 15:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X