ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హైబ్రిడ్ కార్లు

ఇండియన్ హైబ్రిడ్ వెహికల్ మార్కెట్లోకి విడుదల కానున్న కార్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం....

By Anil

పచ్చటి మరియు పరిశుభ్రమైన పర్యావరణ సాధన కోసం భారత ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కాలుష్య రహిత వాహనాల అభివృద్దికి మరియు వాటి అమ్మకాలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. దీనికి తోడుగా కార్ల తయారీ సంస్థలు కూడా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత హైబ్రిడ్ వాహనాల సాంకేతికత అభివృద్దిలో నిమగ్నమయ్యాయి. అందులో కొన్ని తయారీ సంస్థలు తమ హైబ్రిడ్ వాహనాలతో విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

ఇవాళ్టి స్టోరీలో ఇండియన్ హైబ్రిడ్ వెహికల్ మార్కెట్లోకి విడుదల కానున్న కార్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం....

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ ఇండియా తమ సరికొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్ ను పూర్తి స్థాయిలో అభిృద్ది చేస్తోంది. 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది. ఇప్పడికే ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటి సెడాన్‌తో గట్టి పోటీని ఎదుర్కుంటోంది. వీటిని పోటీగా ప్రీమియమ్ కాంపాక్ట్ సెడాన్ ఫీచర్లతో పాటు హైబ్రిడ్ సాంకేతికతో విడుదల కానుంది.

హైబ్రిడ్ కార్లు

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఈ 2017 ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌లో మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. ప్రస్తుతం మారుతి సియాజ్ లో ఉన్న స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి లాగే ఉంటుంది. ఇంజన్‌కు అదనంగా ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం ఉంటుంది.

విడుదల అంచనా: 2017 ఆలస్యంగా

ధర అంచనా: 10 నుండి 15 లక్షల మధ్య

టయోటా ఇన్నోవా

టయోటా ఇన్నోవా

టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో 2.4 మరియు 2.8-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ మరియు 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌లు కలవు. అయితే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 2000సీసీ కన్నా ఎక్కుమ సామర్థ్యం ఉన్న డీజల్ వానహనాల నిషేధం కారణంగా అక్కడి మార్కెట్లోకి విడుదలకు కూడా నోచుకోలేదని చెప్పవచ్చు.

హైబ్రిడ్ కార్లు

భవిష్యత్తులో తమ ఉత్పత్తుల్లో హైబ్రిడ్ సాంకేతికతను అందివ్వడానికి టయోటా సుముఖంగా ఉంది. ప్రీమియమ్ ఎమ్‌పివి సెగ్మెంట్లో మంచి ఫలితాలనిస్తున్న ఇన్నోవా క్రిస్టాలో మిల్డ్ హైబ్రిడ్ సాంకేతికతను అందించే అవకాశాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిని పెట్రోల్ లేదా డీజల్ వేరియంట్లలో ఎందులో పరిచయం చేస్తుందో టయోటా అధికారికంగా వెల్లడించలేదు.

విడుదల అంచనాగా: 2017 చివరికి

ధర అంచనా: 15 నుండి 20 లక్షల మధ్య

టయోటా ఫార్చ్యూనర్

టయోటా ఫార్చ్యూనర్

ఒక వేళ టయోటా తమ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేస్తే అదే సూత్రాన్ని తమ లగ్జరీ ఎస్‌యువి ఫార్చ్యూనర్‌లో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

హైబ్రిడ్ కార్లు

నూతన సొబగులతో ఈ ఏడాదిలో అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన ఫార్చ్యూనర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేస్తే దీని ధర కాస్త తగ్గే అవకాశం ఉంది.

విడుదల అంచనా: 2017 చివరికి లేదా 2018 ప్రారంభానికి

ధర అంచనా: 25 నుండి 30 లక్షల మధ్య.

టయోటా ప్రియస్

టయోటా ప్రియస్

టయోటా కేవలం తమ ప్యాసింజర్ కార్లలో మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో హైబ్రిడ్ వెహికల్‌ను కూడా పరిచయం చేయనుంది. తమ ప్రియస్ సెడాన్ ద్వారా పూర్తి స్థాయి హైబ్రిడ్ వెహికల్ ను విడుదల చేయడానికి టయోటా సిద్దం అవుతోంది.

హైబ్రిడ్ కార్లు

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద టయోటా ఈ ప్రియస్ హైబ్రిడ్ సెడాన్‌ను ప్రదర్శించింది. ఇందులో 1.8-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 96బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును. మరియు ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 71బిహెచ్‌పి పవర్ మరియు 163ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

విడుదల అంచనా: జనవరి 2017 నాటికి

ధర అంచనా: 30 నుండి 40 లక్షల మధ్య

నిస్సాన్ ఎక్-ట్రయల్

నిస్సాన్ ఎక్-ట్రయల్

నిస్సాన్ భారతీయులకు కొత్తపదమేమీ కాదు. గతంలో నిస్సాన్ ఎక్స్-ట్రయల్ ఎస్‌యువిని అందుబాటులో ఉంచింది, ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేనందున లైనప్ నుండి తొలగించింది. ఇప్పుడు ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేసి భారతదేశపు మొదటి హైబ్రిడ్ ఎస్‌యువిగా విడుదలకు సిద్దమవుతోంది.

హైబ్రిడ్ కార్లు

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో రానుంది. సివిటి గేర్‌బాక్స్‌ను అనుసంధానంంతో రానున్న ఇది 141బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

విడుదల అంచనా: మార్చి 2017 నాటికి

ధర అంచనా: 32 నుండి 35 లక్షల మధ్య

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ జిటిఆ

వోక్స్‌వ్యాగన్ పస్సాట్ జిటిఆ

వోక్స్‌వ్యాగన్ గత సంవత్సర కాలం నుండి డీజల్ వాహనాల ఉద్గార కుభకోణంతో అతలాకుతం అయిపోయింది. ప్రపంచపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఇప్పుడు ఇలాంటి కుంభకోణాలకు దూరంగా ఉండేందుకు పర్యావరణహితమైన ఉత్పత్తుల తయారీ మరియు అందుబాటులోకి తీసుకురావడానికి వోక్స్‌వ్యాగన్ సిద్దం అవుతోంది.

హైబ్రిడ్ కార్లు

ఇండియన్ మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్ తమ పస్సాట్ జిటిఇ ని విడుదల చేయనుంది. ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టిఎస్ఐ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం చేయబడింది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 151బిహెచ్‌పి పవర్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ 112బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

విడుదల అంచనా: 2017 ప్రారంభం నాటికి

ధర అంచనా: 30 నుండి 35 లక్షల మధ్య

హ్యుందాయ్ ఇయానిక్

హ్యుందాయ్ ఇయానిక్

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ తమ ఇయానిక్ ను మూడు రకాల పవర్ ట్రైన్లలో అందుబాటులో ఉంచింది. అవి, హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు ఫుల్లీ ఎలక్ట్రిక్. హ్యుందాయ్ ఈ ఇయానిక్‌ను ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లేదా ఫుల్లీ ఎలక్ట్రిక్ వేరియంట్లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

హైబ్రిడ్ కార్లు

హ్యుందాయ్ ఇయానిక్ లో 1.6-లీటర్ సామర్థ్యం గలపెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 147ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మరియు దీనికి అనుసంధానం చేసిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 60బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

విడుదల అంచనా: జనవరి 2017 నాటికి

ధర అంచనా: 9 నుండి 15 లక్షల మధ్య

హైబ్రిడ్ కార్లు

  • డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
  • మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?
  • 80 ఏళ్ల తరువాత ఒడ్డుకు చేరిన వ్యభిచారపు నౌక గురించి ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Upcoming Hybrid Vehicles In India — Time To Add Some Clean Electric Power
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X