డీజల్ వేరియంట్ శని అమియోను కూడా వీడట్లేదు

Written By:

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగ్ ఈ మధ్య కాలంలో ఇండియన్ మార్కెట్లోకి తమ డీజల్ వెర్షన్ అమియో కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసింది. అయితే డీజల్ సెడాన్‌ల మధ్య ఉన్న పోటీ వేడి ప్రభావం అమియో మీద స్పష్టంగా తెలుస్తోంది.

వోక్స్‌వ్యాగన్ ఈ అమియో కాంపాక్ట్ సెడాన్‌ను ప్రత్యేకించి భారతీయుల కోసం అభివృద్ది చేసింది. అయితే అమ్మకాల పరంగా ఏ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతోంది.

విడుదలైన కేవలం మూడు నెలల్లోనే అమ్మకాల్లో ఏకంగా 62.7 శాతం వృద్ది తగ్గుముఖం పట్టింది.

వోక్స్‌వ్యాగన్ ఆష్టు నెలలో 2,427 అమియో కార్లను అమ్మగా, సెప్టెంబర్ 2016 మాసంలో 1,491 యూనిట్లకే పరిమితం అయ్యింది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) తెలిపిన వివరాల ప్రకారం వోక్స్‌వ్యాగన్ అమియోను విడుదల చేసిన మొదటి నెల జూలైలో 2,200 యూనిట్ల అమ్మకాలు జరిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తరువాత మాసం ఆగష్టులో అమ్మకాల పరంగా స్వల్ప వృద్దిని సాధించింది. అయితే ఆ తరువాతే వచ్చిన సెప్టెంబర్‌లో సగానికి పైగా అమ్మకాలు పడిపోయాయి. కారణం ఇండియన్ మార్కెట్లో ఉన్న సి1 సెగ్మెంట్లో గట్టి పోటీ.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోని సి1 సెగ్మెంట్లో మంచి విజయం సాధించిన ఉత్పత్తులు - హ్యుందాయ్ ఎక్సెంట్, సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ మరియు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వంటివి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఉత్పత్తి అమియో సెడాన్. దీని ప్రారంభ ధర రూ. 5.14 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.91 లక్షలుగా ఉంది.

కేవలం అమియో సెడాన్ మాత్రమే కాదు గడిచిన సెప్టెంబర్ మాసం అమ్మకాల్లో హ్యుందాయ్ ఎక్సెంట్, రెనో స్కాలా, మహీంద్రా వెరిటో, నిస్సాన్ సన్నీ, టాటా జెస్ట్ మరియు షెవర్లే సెయిల్ వంటి ఉత్పత్తులు కూడా అమ్మకాల్లో వెనుకంజలో ఉన్నాయి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu: Volkswagen Ameo Feels The Heat Of Competition In India
Please Wait while comments are loading...

Latest Photos