25.65 లక్షల భారీ ధరతో విడుదలైన వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ పోలో జిటిఐ హాట్ హ్యాచ్‌బ్యాక్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా 25.65 లక్షల ప్రారంభ ధరతో దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

By Anil

జర్మనీ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ దేశీయ విపణిలోకి తమ పోలో జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైన పోలో జిటిఐ హాట్ హ్యాచ్‌బ్యాక్‌, కేవలం 99 యూనిట్లుగా దేశవ్యాప్తంగా అమ్మకాలు జరపనుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ లిమిటెడ్ ఎడిషన్ ధర లు

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ లిమిటెడ్ ఎడిషన్ ధర లు

  • ముంబాయ్ - 25.65 లక్షలు
  • ఢిల్లీ - 25.99 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.
    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    దేశవ్యాప్తంగా కేవలం 99 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి రానున్న పోలో జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌లో 1.8-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 189బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    పోలో జిటిఐ లోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌కు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ కలదు. దీని ద్వారా ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ కేవలం 7.2 సెకండ్ల కాల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 233 కిలోమీటర్లుగా ఉంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    ప్రస్తుతం ఉన్న సాధారణ పోలో కన్నా ఈ పోలో జిటిఐ ఎంతో ప్రత్యేకమైనది. ఈ వేరియంట్ కేవలం మూడు డోర్లను మాత్రమే కలిగి ఉంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    డిజైన్ పరంగా ఈ పోలో జిటిఐ ముందు భాగంలో తేనెతుట్టె ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ కలదు. ఇది ఇరువైపులా ఉన్న రెండు ఎల్‌ఇడి లైట్లకు మధ్యలో అమర్చబడి ఉంది. రెండు హెడ్ లైట్లను కలుపుతూ ఎర్రటి గీత ఫ్రంట్ గ్రిల్ మీదుగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    ముందు వైపున బంపర్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బంపర్‌ నుండే అధిక గాలిని గ్రహించే విధంగా పెద్ద ఎయిర్ ఇంటేకర్‌ను అందించారు.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    బయటకు రాజుకున్న తోరణాల వలే అల్లాయ్ వీల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నాలుగు వైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    పోలో జిటిఐ లిమిటెడ్ ఎడిషన్‌లో వెనుక వైపునడ్యూయల్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైపులు కలవు. గరిష్ట వేగంతో ఎగ్జాస్ట్ వాయువులను బయటకు నెట్టే ఈ రెండు ఎగ్జాస్ట్ గొట్టాలను వెనుక భాగంలో ఎడమ వైపున అందించారు.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    పోలో జిటిఐ లోని ఇంటీరియర్‌లో అడుగుకు చదునుగా ఉండే అధునాతన శైలిలో ఉండే స్టీరింగ్ వీల్ కలదు.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    అప్‌హోల్‌స్ట్రే మీద మరియు సీట్ల మీద జిటిఐ సిగ్నేచర్ గల ఎర్రటి పట్టీలను అందించారు.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    దేశవ్యాప్తంగా కేవలం 99 సంఖ్యలో అందుబాటులో ఉన్న పోలో జిటిఐ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మిని కూపర్ తో పోటీ పడనుంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

    • 2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అసలు రూపం ఇదే...!!
    • అత్యంత ఖరీదైన ఎస్‌యువిని విడుదల చేసిన మిత్సుబిషి
    • ఇండియా కోసం స్కోడా ఖాయం చేసిన కాంపాక్ట్ ఎస్‌యువి ఇదే

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen Polo GTI Launched In India; Prices Start At Rs. 25.65 Lakh
Story first published: Thursday, November 3, 2016, 17:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X