అల్వాస్ మోటోరిగ్ మళ్లీ మొదలైంది: మీ వెహికల్స్‌తో సిద్దంగా ఉండండి

Written By:

దక్షిణ కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని మూడిబిదిరిలో ఉన్న అల్వాస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ గత మూడేళ్లుగా విభిన్న వాహన ప్రదర్శన నిర్వహిస్తూ వస్తోంది. ఇపుడు నాలుగవ ఎడిషన్ మోటోరిగ్ 2017 వేడుకలు 21 నుండి ప్రారంభ కానున్నాయి.

ఆల్వాస్ మోటోరిగ్ వార్షికోత్సవ వేడుకల్లో విభిన్న రకాల ఆటోమొబైల్స్ ప్రదర్శన ఉంటుంది. ఇందులో సూపర్ బైకులు, సూపర్ కార్లు, లగ్జరీ కార్లు మరియు వింటేజ్ కార్లను ప్రదర్శిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారుగా 200 కు పైగా లగ్జరీ మరియు సూపర్ కార్లు ప్రదర్శనకు రానున్నాయి.

ఈ ఏడాది మోటోరిగ్ కార్యక్రమాన్ని అల్వాస్ ఎడ్యుకేషనల్ సొసైటి ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ అల్వా గారు ప్రారంభించనున్నారు. అదానీ యుపిసిఎల్ అదే విధంగా ఇండియన్ ర్యాలీ ఛాంపియన్ కో డ్రైవర్ అశ్విన్ నాయక్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొనున్నారు.

ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, బెద్రా అడ్వెంచరస్ క్లబ్, కెఎల్14, TASC, టీమ్ బేద్రా యునైటెడ్ మరియు కోస్టల్ రైడర్స్ సంయుక్త భాగస్వామ్యంతో అల్వాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ మోటోరిగ్ ఈవెంట్ నిర్వహిస్తోంది.

దక్షిణ కర్ణాటక ప్రాంతీయ మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఈ మోటోరిగ్ ఈవెంట్‌లో పాల్గొనే విద్యార్థులు అపారమైన పరిజ్ఞానాన్ని పొందుతారు మరియు కొత్త విషయాలను కూడా తెలుసుకోవచ్చు.

ఆటోమొబైల్స్ మీద ఎక్కువ మక్కువ ఉన్న విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విభిన్న రకాల వాహనాల ఇంజన్‌లు, ఛాసిస్, బాడీ ఎక్ట్సీరియర్ డిజైన్, అంతర్గత విడి పరికరాల పనితీరు మరియు వాటీ తయారీపరమైన అనేక సమచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తున్నవారికి మరియు ఇతర విభాగాల్లో చదువుతున్న వారికి ప్రస్తుతం ఆటోమొబైల్స్ తీరు మరియు భవిష్యత్ ఆటోమొబైల్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

అల్వాస్ మోటోరిగ్ నాలుగవ ఏడిషన్ ప్రత్యేకతలు

200 వాహనాలకు పైగా ఈ ఈవెంట్‌లో ప్రదర్శనకు రానున్నాయి. అందులో స్పోర్ట్స్ బైకులు, లగ్జరీ మరియు ర్యాలీ బైకులు, సూపర్ కార్లు, లగ్జరీ కార్లు అదే విధంగా పురాతణ కార్లను కొలువుదీర్చనున్నారు.

జైపూర్‌కు చెందిన సైక్లోన్ బృందం నుండి వస్తున్న నేషనల్ ఫ్రీ స్టైల్ మోటోస్పోర్ట్స్ రైడర్ గౌరవ్ ఖాత్రి ఈ అల్వాస్ మోటోరిగ్ ఈవెంట్ రకరకాల స్టంట్లు చేయనున్నాడు.

ఇండియన్ ర్యాలీ ఛాంపియన్ మంగళూరుకు చెందిన అర్జున్ రావు మరియు రాహుల్ కాంత్‌రాజ్ అదే విధంగా ఇండియన్ ర్యాలీ సూపర్ క్రాస్ ఛాంపియన్స్ అదనన్ మరియు సుదీప్ కొటారి ఇందులో పాల్గొని కొన్ని స్టంట్లు చేయనున్నారు.

మూడు పర్యాయాలు విజయవంతంగా మోటోరిగ్ ఈవెంట్ పూర్తి చేసుకుని నాలుగవ ఎడిషన్‌కు సిద్దమైన అల్వాస్ మోటోరిగ్ ఈవెంట్‌కు DriveSpark అఫీషియల్ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. త్వరలో ఈవెంట్ హైలెట్స్ మరో కథనంలో ప్రచురిస్తాం... చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu Alva's Motorig 4 To Be Held On May 21
Please Wait while comments are loading...

Latest Photos