రియో సెడాన్‌ను తొలి ఉత్పత్తిగా విడుదల చేయనున్న కియా మోటార్స్

Written By:

హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఉప సంస్థ కియా మోటార్స్ ఇండియా ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లే. ఏడాదికి మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్‌‌లోని అనంతపురంలో భూ సేకరణ ప్రారంభించింది.

కియా మోటార్స్ తొలుత కాంపాక్ట్ సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ల మీద దృష్టి సారించింది. రియా ఆధారిత సెడాన్ కారును కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి తీసుకురానుంది.

కియా అంతర్జాతీయ లైనప్‌లో చిన్న కారుగా చెప్పుకునే రియో నుండి కియా ఆప్టిమా తో పాటు అనేక మోడళ్లు ఉన్నాయి, అదే విధంగా పెద్ద పరిమాణంలో ఉన్న క్యాడెంజా మరియు కె900 వంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

రియో ఆధారిత సెడాన్ కారును మా మొదటి ఉత్పత్తిగా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దంగా ఉన్న కియా మోటార్స్ తెలిపింది. ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ కలదు. ఇది హ్యుందాయ్ వెర్నాకు సమానమైన పవర్ ఉత్పత్తి చేస్తుంది.

రియో ఆధారిత కాంపాక్ట్ సెడాన్‌లోని పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 106బిహెచ్‌పి పవర్ మరియు 135ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. మరియు ఇది 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ వేరియంట్లో కూడా రానుంది.

డీజల్ విషయానికి వస్తే, 1.4 మరియు 1.6 లీటర్ సామర్థ్యం ఉన్న వేరియంట్లతో డీజల్ ఇంజన్ ఇంజన్‌లు రానున్నాయి. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో రానుంది.

ఫీచర్ల పరంగా కియా రియో సెడాన్‌లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, తాకే తెర పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ న్యావిగేషన్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఇందులో రానున్నాయి.

అమెరికా విపణిలో కియా రియో సెడాన్ కారు రూ. 10 లక్షల రిటైల్ ధరతో లభిస్తోంది, అయితే దేశీయంగా ఉన్న మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి, హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీనిచ్చే విధంగా ధరను నిర్ణయించనుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu To Know About Kia Rio Sedan Will Begin The Indian Operations
Please Wait while comments are loading...

Latest Photos