2017 నిస్సాన్ సన్నీ సెడాన్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు

నిస్సాన్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్‌కు నూతన అప్‌గ్రేడ్స్ నిర్వహించి 2017 నిస్సాన్ సన్నీని మార్కెట్లోకి విడుదల చేసింది.

Written By:

నిస్సాన్ ఇండియా 2017 సన్నీ మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన సన్నీ సెడాన్ ప్రారంభ ధర రూ. 7.91 లక్షలు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ)గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ విక్రయ కేంద్రాలలో ఇది అందుబాటులో ఉంది.

2017 నిస్సాన్ సన్నీ ధర వివరాలు

  • ఎక్స్ఇ పెట్రోల్ ధర రూ. 7,91,300 లు
  • ఎక్స్ఇ డీజల్ ధర రూ. 8,80,066 లు
  • ఎక్స్ఎల్ పెట్రోల్ ధర రూ. 8,40,133 లు
  • ఎక్స్ఎల్ డీజల్ ధర రూ. 9,46,035 లు
  • ఎక్స్‌వి డీజల్ ధర రూ. 9,93,000 లు
  • ఎక్స్‌వి సేప్టీ డీజల్ ధర రూ. 10,76,011 లు
  • ఎక్స్‌వి సివిటి పెట్రోల్ ధర రూ. 10,89,263 లు

2017 నిస్సాన్ సన్నీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లలో లభించును. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98బిహెచ్‌పి పవర్ మరియు 134ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

పెట్రోల్ వేరియంట్ సన్నీ సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతోంది. ఇది గరిష్టంగా 16.95 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

2017 నిస్సాన్ సన్నీ సెడాన్‌లోని 1.5-లీటర్ ఇంజన్ గరిష్టంగా 85బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది లీటర్‌కు 22.7 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ప్రస్తుతం ఈ 2017 నిస్సాన్ సెడాన్ కార్ల మీద రెండు సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని కల్పిస్తోంది. మరియు 2017 సన్నీ లోని అన్ని వేరియంట్లకు కూడా ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ కల్పిస్తోంది.

సరికొత్త నిస్సాన్ సన్నీ ఇప్పుడు శాండ్‌స్టోన్ బ్రౌన్ ఎక్ట్స్రీరియర్ కలర్ లో లభిస్తోంది, ఎక్ట్సీరియర్ పై భాగంలో డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ గ్రిల్ వంటి వాటిని క్రోమ్‌తో అందించింది. ఇంటీరియర్‌లో ఆప్షనల్‌గా బ్లాక్ ప్యాబ్రిక్ సీట్లు, డ్యాష్ బోర్డ్ మరియు ఇతర ప్లాస్టిక్ ప్యానళ్లను బ్లాక్ రంగులో అందివ్వడం జరుగుతుంది.

నూతన సన్నీ సెడాన్ లో ఇంటెలిజెంట్ కీ, పుష్ బటన్ స్టార్ట్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ పోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించింది. టాప్ ఎండ్ వేరియంట్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
2017 Nissan Sunny Launched In India [Details + Photo Gallery]
Please Wait while comments are loading...

Latest Photos