రెనో డస్టర్‌ను ఎగబడి కొంటున్నారా...? ఇది తెలిస్తే ఖచ్చితంగా మానేస్తారు!

ఇండియన్ రెనో డస్టర్ బేసిక్ వేరియంట్‌కు గ్లోబల్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో జీరో స్టార్ లభించింది. ఎయిర్ బ్యాగ్ వేరియంట్ అయితే కేవలం రెండు స్టార్లకు మాత్రమే పరిమితమయ్యింది.

By Anil

సేఫ్‌ కార్స్ ఫర్ ఇండియా (#SafeCarsForIndia) రెండవ విభాగంలో గ్లోబల్ ఎన్‌సిఎపి రెనో డస్టర్‌కు నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాలను వెల్లడించింది. ఎయిర్ బ్యాగులు లేని మరియు ఎయిర్ బ్యాగులు ఉన్న వేరియంట్లకు విడివిడిగా క్రాష్ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో భారీ విక్రయాలు సాధిస్తున్న మోడల్ రెనో డస్టర్. ఈ క్రాష్ పరీక్షలను ఒక్కసారి గమనిస్తే డస్టర్ మీద మనసుపడిన వారు మనసు మార్చుకోవడం ఖాయం.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

ప్రస్తుతం విపణిలో ఎలాంటి ఎయిర్ బ్యాగులు లేకుండా అమ్ముడుపోతున్న బేసిక్ వేరియంట్ క్రాష్ పరీక్షల్లో సున్నా రేటింగ్ పొందింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

క్రాష్ పరీక్షల్లో డ్రైవర్ స్థానంలో ఉంచిన డమ్మీ బొమ్మను గమనించిన గ్లోబల్ ఎన్‌సిఎపి ఎయిర్ బ్యాగు లేకపోవడం వలన ముందు వైపు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

అంతే కాకుండా ఇదే డస్టర్ పిల్లల భద్రత పరంగా రెండు స్టార్ల రేటింగ్‌కు పరిమితమయ్యింది. క్రాష్ టెస్ట్ అనంతరం వచ్చిన ఫలితాల ఆధారంగా ఎయిర్ బ్యాగు వేరియంట్ డస్టర్‌కు క్రాష్ పరీక్షలు నిర్వహించమని గ్లోబల్ ఎన్‌సిఎపిను రెనో కోరింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

గ్లోబర్ ఎన్‌సిఎపి ఎయిర్ బ్యాగ్ వేరియంట్ రెనో డస్టర్‌కు క్రాష్ పరీక్షలు నిర్వహించడానికి సిద్దమైంది. అయితే ఇదే మోడల్ గతంలో 2015 లాటిని ఎన్‌సిఎపి పరీక్షల్లో నాలుగు స్టార్లను పొందింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

ఇండియన్ మార్కెట్లో ఉన్న డస్టర్ క్రాష్ పరీక్షల్లో ఫెయిల్ కావడం వెనకున్న అంశాలను దర్యాప్తు చేసిన గ్లోబల్ ఎన్‌సిఎపి ఇండియన్ డస్టర్ వేరియంట్లో ఉన్న ఎయిర్ బ్యాగుల పరిమాణం లాటిన్ అమెరికాలో లభించే డస్టర్ మోడల్ లోని ఎయిర్ బ్యాగుల పరిమాణం కన్నా తక్కువగా ఉన్నట్లు తెలిపింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

గ్లోబల్ ఎన్‌సిఎపి సెక్రెటరీ జనరల్, డేవిడ్ వార్డ్ మాట్లాడుతూ, ఇండియన్ మోడల్‌కు యుఎన్ రోడ్ సేఫ్టీ వీక్‌‌లో క్రాష్ టెస్ట్ నిర్వహించినపుడు సున్నా రేటింగ్ వచ్చింది మరియు ఎయిర్ బ్యాగ్ వేరియంట్ డస్టర్ మూడు స్టార్ల రేటింగ్ పొందినప్పటికీ, ఎయిర్ బ్యాగుల పరిమాణం చిన్నగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని చెప్పుకొచ్చారు.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

లాటిని అమెరికా డస్టర్ మోడల్‌కు క్రాష్ పరీక్షలు నిర్వహిస్తే ఐదింటికి నాలుగు స్టార్లను పొందింది. ఇందులో ఉన్న ఎయిర్ బ్యాగులు డ్రైవర్ తల, ఛాతీ లను రక్షిచడంలో అద్బుతం అని తేలింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఇన్‌‌స్ట్యూట్ ప్రెసిడెంట్ రోహిత్ బలుజా మాట్లాడుతూ, స్పోర్టివ్ వెహికల్‌గా రెనో డస్టర్ పేరుపొందింది. డ్రైవర్లు దీనిని అత్యధిక వేగంతో నడపాలను ఆశపడతారు, కాబట్టి అత్యుత్తమ భద్రత ఫీచర్లందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

ప్రధాన మంత్రి మేడిన్ ఇండియా ద్వారా దేశీయంగా తయారీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, కార్ల తయారీ సంస్థ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అత్యుత్త భద్రత ప్రమాణాలతో కార్లను ఉత్పత్తి చేసి దేశీయంగానే కాకుండా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చని రోహిత్ పేర్కొన్నారు.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

వివిధ దేశాల మధ్య ఎయిర్ బ్యాగు సైజుల్లో తేడా ఏంటి అనుకుంటున్నారా...? దేశీయంగా ఉన్న కార్లలో ఖచ్చితంగా ఎయిర్ బ్యాగులను అందించాలి, వాటి పరిమాణం ఖచ్చితంగా ఇంతే ఉండాలి వంటి ప్రమాణాలు లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పవచ్చు.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

విదేశీ మార్కెట్లలో ఆయా ప్రభుత్వాలు తెలిపిన ప్రమాణాల మేరకు కార్ల భద్రత ఫీచర్లను అందించాల్సి ఉంటుంది. ఇక్కడే కార్ల తయారీ సంస్థలు చేస్తున్న మోసం బయటపడింది.

రెనో డస్టర్ క్రాష్ టెస్టు

మా వెహికల్స్‌లో ఎయిర్ బ్యాగులు ఉన్నాయని తెలిపేందుకు నామమత్రపు ఎయిర్ బ్యాగులతో కస్టమర్లను మభ్యపెడుతున్నాయి. వేగంగా వృద్ది చెందుతున్న వాహన పరిశ్రమకు అన్ని ప్రమణాలు పాటిస్తూ భద్రత ఫీచర్లను అందించే విధంగా మార్పు తీసుకురావడంలో కేంద్రం మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

గ్లోబల్ ఎన్‌సిఎపి రెనో డస్టర్‌కు క్రాష్ టెస్ట్ నిర్వహించడాన్ని వీడియోలో వీక్షించగలరు....

Most Read Articles

English summary
Read In Telugu About Renault Duster Fails Global NCAP Crash Test
Story first published: Thursday, May 11, 2017, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X