వచ్చే పండుగ సీజన్ నాటికి విడుదల కానున్న రెనో క్యాప్చర్

Written By:

రెనో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి తమ క్యాప్చర్ కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేయనుంది. వచ్చే 2017-2018 ఆర్థిక సంవత్సరంలోని మూడవ త్రైమాసికంలో విడుదల చేయనుందనే సమాచారం కూడా కూడా ఒకటి ప్రచారం ఉంది.
 

ఆటోమొబైల్ సమాచార వేదిక ఇటి ఆటో తెలిపిన సమాచారం మేరకు రెనో తమ క్యాప్చర్ కాంపాక్ట్ ఎస్‌యువిని ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది కథనాన్ని ప్రచురించింది.

ప్రారంభంలో రెనో ఇండియా తెలిపిన కథనం మేరకు ఇక మీదట ఇండియన్ మార్కెట్లోకి తమ లైనప్‌ ద్వారా ప్రతి ఏడాది కూడా ఒక కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

రెనో ప్రస్తుతం దేశీయంగా విడుదల చేయనున్న క్యాప్చర్ ను డస్టర్ ఎస్‌యువి ఆధారంగా అభివృద్ది చేయబడింది. అయితే యూరోపియన్ మరియు మధ్య ప్రాశ్చ దేశాలలో అందుబాటులో ఉన్న క్యాప్చర్ క్లియో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించబడింది.

దేశీయంగా రెనో లైనప్‌లో ఉన్న డస్టర్ కన్నా దిగువ స్థానంలో క్యాప్చర్ ను ప్రవేశపెట్టనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యువిని ఒరగడమ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. దాదాపుగా 80 శాతం వరకు దేశీయంగా ఉత్పత్తి చేసిన పరికరాలతో తయారు చేయనుంది.

అంతర్జాతీయ విపణిలో లభించే అవే డిజైన్ లక్షణాలతో దేశీయంగా పరిచయం కానుంది. ముందు వైపున ఉబ్బెత్తుగా ఉండే ఫ్రంట్ ఫాసికాలో రెనో లోగో కు అధిక ప్రాధాన్యతనిచ్చారు. తేనెపెట్టె ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఇందులో కలవు.

ఇంటీరియర్ పరంగా డస్టర్ ఎస్‌యువిలో ఉన్నటువంటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో రానుంది. బ్లాక్ మరియు బీజి కలర్ ఇంటీరియర్‌తో ఫినిషింగ్‌తో రానుంది.

అయితే రెనో దీనికి సంభందించిన సాంకేతికంగా వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తోంది. కాని ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు దేశీయంగా అందుబాటులోకొచ్చే ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

ప్రారంభంలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్న ఇది, ఆలస్యంగా ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా విడుదల కానుంది.

ప్రస్తుతం ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా వారి టియువి300 ఎస్‌యువిలకు రెనో క్యాప్చర్ కాంపాక్ట్ ఎస్‌యువి గట్టి పోటీనివ్వనుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
English summary
Renault Kaptur To Be Launched This Festive Season In India
Please Wait while comments are loading...

Latest Photos