సంచలనాత్మక మైలురాయికి దగ్గరలో రెనో క్విడ్ - మారుతికి తలనొప్పి ప్రారంభమైందా...?

Written By:

రెనో వారి విప్లవాత్మక హ్యాచ్‌బ్యాక్ కారు క్విడ్ దేశీయంగా ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇతర కార్లను కొనాలకున్న వారంతా క్విడ్ విడుదలతో మనసు మార్చుకున్నారు అనడానికి గత ఏడాది కాలంగా క్విడ్ జరిపిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. రెనో ఇండియా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా 1,30,000 క్విడ్‌లను విక్రయించింది.

రెనో ఇండియాకు అంతకు ముందు పెద్దగా విజయయం సాధించి పెట్టిన దాఖలాలు పెద్దగా లేవు. డస్టర్‌తో మంచి విజయాన్ని రుచించినప్పటికీ అనతికాలంలోనే పోటీదారుల నుండి చతికిల పడింది. అయితే ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ తెచ్చిన క్విడ్ తో రెనో పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.

ప్రారంభంలో రెనో తమ క్విడ్‌ను 800సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేసింది. తరువాత దీనికి కొనసాగింపుగా 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల వేరియంట్లను కూడా పరిచయం చేసింది.

2016 చివరి నాటికి రెనో మార్కెట్ షేర్ విలువ 4.5 శాతం మేర పెరిగింది. మరియు 2015 తో పోల్చుకుంటే 2016 లో మూడంకెల వృద్దిని సాధించింది. ఇండియన్ మార్కెట్లో శరవేగంగా వృద్ది చెందుతున్న నూతన ఆటోమోటివ్ కార్ బ్రాండ్‌లలో రెనో ఒకటి. ఈ అన్ని విజయాల వెనకున్న రహస్యం క్విడ్.

రెనో క్విడ్‌ను 1.0-లీటర్ ఇంజన్‌తో విడుదల చేసిన అనతరం, కస్టమర్ల జీవిత చక్రంలో క్విడ్ పేరు మరిచిపోకుండా క్విడ్ పేరు మీద అనేక కొత్త ఉత్పత్తులను (క్లింబర్, రేసర్ అనే హ్యాచ్ బ్యాక్ కార్లు) మార్కెట్లోకి విడుదల చేయాలని రెనో నిర్ణయం తీసుకుంది. 

రెనో క్విడ్ 2016కి గాను భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో స్థానం సంపాదించుకుంది మరియు రెనో కుటుంబంలో అత్యుత్తమ విక్రయాలు సాధించే వేరియంట్‌గా మొదటి స్థానంలో నిలిచింది.

రెనో ఇండియా దేశీయంగా తయారు చేసే క్విడ్ ఉత్పత్తులను దక్షిణ ఆఫ్రికాలో విడుదల చేసింది. దేశీయ విపణి తరహాలో దక్షిణ ఆఫ్రికా మార్కెట్లో కూడా మంచి ఫలితాలను సాధిస్తోంది.

మా అనుభవజ్ఞులు వ్రాసిన రెనో క్విడ్ రివ్యూ.....
మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

రెనో క్విడ్ కారు పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన సమాచారం !!

మీ నగరంలో రెనో కార్ల ధరలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి....

రెనో దేశీయంగా అందుబాటులో ఉంచిన అన్ని కార్ల ఫోటోలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరియు రెనో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ ఫోటోలను డౌన్ లోడ్ కోసం మరియు వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
Story first published: Thursday, February 23, 2017, 11:28 [IST]
English summary
Renault Kwid Hits Important Sales Milestone In India — No Wonder Maruti Has A Headache
Please Wait while comments are loading...

Latest Photos