దొంగలు బాగా రుచిమరిగిన కార్లు ఇవేనండోయ్...!!

Written By:

ఒక్కో ప్రాంతం ఆధారంగా ఒక్కో విధమైన కార్లను దొంగలిచండానికి దొంగలు ఇష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ మోడళ్ల మీద దృష్టి సారిస్తున్నారు. గుజరాత్‌లో హ్యుందాయ్ శాంట్రో కార్లను అతి దొంగలిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

హ్యుందాయ్ శాంట్రో ఇప్పుడు ప్రొడక్షన్‌లో లేదు, ఇలాంటి పాత కార్లను ఎందుకు దొంగలిస్తున్నారు అనే సందేహం మాలాగే చాలా మందికి కలగింటుంది. ఎందుకంటే ఈ ప్రొడక్షన్‌లో లేని కార్లను రీ మోడలింగ్ చేసి ట్యాక్సీలుగా అమ్మేస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలో గడిచిన ఆరు నెలల కాలంలో ఏకంగా 12 కార్లు అపహరించబడ్డాయి. హ్యుందాయ్ శాంట్రో ఇప్పుడు ఆ జిల్లాలోని దొంగలకు అత్యంత ప్రీతికరమైన కారుగా నిలిచింది.

దొంగలు శాంట్రోని అధికంగా దొంగలించడానికి ఉన్న మరో కారణం, హ్యుందాయ్ శాంట్రో ఉత్పత్తి నిలిచిపోయినప్పటి నుండి ఒక కారు నుండి మరో కారుకి పోలిక చాలా తక్కువగా ఉంటుంది. మోడల్‌ డిజైన్‌లో ఎలాంటి వ్యత్యాసం లేదు. కాబట్టి వీటిని గుర్తించడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.

అపహరించడం మాత్రమే కాదు, అపహరించిన కారుకు రీ పెయింటింగ్, నెంబర్ ప్లేట్ మార్చడం, ఛాసిస్ నెంబర్ మార్చడం వంటివి చేసి ట్యాక్సీలుగా అమ్మేస్తున్నారు. ఇక పోలీస్ చెక్ పాయింట్లలో ట్యాక్సీలను తనిఖీ నామమాత్రంగానే ఉంటుంది.

దొంగలించిన కారును అమ్మే చివరి మెట్టు, పేపర్లను సృష్టించడం. కారు యాజమాని వివరాలు, చిరునామా మరియు ఇన్సూరెన్స్ వంటి పేపర్లన్నింటిని కూడా సృష్టించడం.

దీనికి సాక్ష్యం 2013 లో జరిగిన ఓ సంఘటన, ముంబైలో పోలీసులకు ఓ కార్ల దొంగల ముఠా పట్టుబడింది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్య ప్రదేశ్ లలో అపహరించిన కార్లను ముంబైలో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

చిన్న కార్ల మార్కెట్లో సునామీ సృష్టించిన శ్యాంట్రో ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయింది. అయితే రెనో ఇండియా దేశీయంగా ఎస్‌యూవీ శైలిలో ఉండే క్విడ్ కారును విడుదల చేసింది. క్విడ్ కోసం క్రింది ఫోటోల మీద క్లిక్ చేయండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Watch Out! This Is The Favourite Car Among Thieves
Please Wait while comments are loading...

Latest Photos