పోలో జిటిఐ స్పోర్ట్ లాంచ్ చేసిన వోక్స్‌వ్యాగన్: ధర రూ. 9.10 లక్షలు

Written By:

వోక్స్‌వ్యాగన్ తమ శక్తివంతమైన పోలో జిటిఐ ను స్పోర్టివ్ వేరియంట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 9.10 లక్షల ప్రారంభ విడుదలైన స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ టిఎస్ఐ మరియు టిడిఐ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

  • వోక్స్‌వ్యాగన్ పోలో జిటి స్పోర్ట్ పెట్రోల్ ధర రూ. 9,1,900 లు
  • వోక్స్‌వ్యాగన్ పోలో జిటి స్పోర్ట్ డీజల్ ధర రూ. 9,21,300లు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

వోక్స్‌వ్యాగన్ తమ పోలో జిటిఐ లో ఎలాంటి ఇంజన్ మార్పులు చేయకుండా స్పోర్ట్ వేరియంట్లో విడుదల చేసిన ఇందులో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చేసింది. డైనమిక్ లుక్‌ను అందించే విధంగా ఎక్ట్సీరియర్ మీద అనేక స్పోర్టివ్ సొబగులు అందివ్వడం జరిగింది.

ప్రస్తుతం విపణిలో ఉన్న స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌లను దృష్టిలో ఉంచుకుని దీని ఎక్ట్సీరియర్‌లో సరికొత్త పోర్టాగో అల్లాయ్ వీల్స్, రెడ్ మరియు బ్లాక్ ఎక్ట్సీరియర్ రంగుల మేళవింపు, గ్లోసీ బ్లాక్ కలర్‌లో ఉన్న స్టైలిష్ రూఫ్ స్పాయిలర్ వంటివి ఇందులో ప్రత్యేకం.

పోలో జిటిఐ స్పోర్ట్ ఇంటీరియర్‌‌లో జిటి స్పోర్ట్ సీట్ కవర్లతో ఉన్న లెథర్ సీట్లు, స్పోర్ట్ ఎడిషన్ యొక్క నిర్వచనాన్ని వోక్స్‌వ్యాగన్ ఈ బ్లాక్ లెథర్ సీట్లతో వివరించిందని చెప్పవచ్చు.

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ స్పోర్ట్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్‌లో మునుపటి అవే రెండు ఇంజన్‌లను కొనసాగించింది. దీనిని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టిడిఐ ఇంజన్‌లు కలవు.

పెట్రోల్ యూనిట్ గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగా, డీజల్ వేరియంట్ గరిష్టంగా 108.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ స్పోర్ట్‌ను రెండు విభిన్నమైన కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. అవి, ఫ్లాష్ రెడ్ మరియు క్యాండీ వైట్. పోలో జిటిఐ స్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ఫోర్డ్ ఫిగో ఎస్ మరియు బాలెనో ఆర్ఎస్ నోరు మూయించనుంది.

ఎక్కువ శక్తివంతమైన ఇంజన్, అత్యుత్తమ పనితీరు, అద్బుతమైన స్టైల్, మరియు ఫీచర్ల ద్వారా ఈ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లో పోలో జిటిఐ స్పోర్ట్ ప్రథమ ఎంపిక అని వోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్ హెడ్ పేర్కొన్నారు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, April 26, 2017, 13:45 [IST]
English summary
Read In Telugu To Know About Volkswagen Polo GT Sport Launched In India; Prices Start At Rs 9.10 Lakh. Get more details about new volkswagen polo gti sport.
Please Wait while comments are loading...

Latest Photos