మళ్లీ మెరిసిన హీరో మోటోకార్ప్ డాన్ 125 బైక్

Written By:

హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైకు డాన్ 125 ని 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది. హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి పవన్ ముంజాల్ ప్రదర్శించారు. భారతీయ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మరిన్ని నూతన ఉత్పత్తులను ఈ వేదిక మీద కొలుదీర్చింది.

సాంకేతికంగా హీరో డాన్ 125 మోటార్ సైకిల్‌లో 125సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే 4-స్ట్రోక్ ఓహెచ్‌సి సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 9బిహెచ్‌పి పవర్ మరియు 10.35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ‌ను ఉత్పత్తి చేయగలదు.

ప్రదర్శన సమయంలో హీరో మోటోకార్ప్ తెలిపిన వివరాల మేరకు అత్యుత మైలేజ్ ఇవ్వడానికి ఇందులో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలిసింది. ఈ నూతనంగా డాన్ 125 మోటార్ సైకిల్‌ను ఆఫ్రికా దేశాల కోసం అభివృద్ది చేసినట్లు హీరో తెలిపింది. ఈ సరికొత్త డాన్ 125 ను కెన్యా, టాంజానియా, ఎథియోపియా, యుగాండా మరియు మొజాంబిక్ దేశాలలో విడుదలల చేయనున్నారు.

కమర్షియల్ మార్కెట్ పరంగా మంచి డిమాండ్ ఆఫ్రికా దేశాలలో వీటికి మంచి ఆదరణ ఉంటుంది హీరో భావిస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, గరిష్ట పవర్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఇంజన్ ద్వారా ఆఫ్రికన్లను ఆకట్టుకుంటుందనే నమ్మకంలో ఉంది హీరో. ఆఫ్రికన్లకు ప్రత్యేకించి రూపొందించిన ఇందులో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, పొడగించబడిన ఫుట్ రెస్ట్, విశాలవంతమైన వెనుక క్యారీయర్ ఇందులో ఉన్నాయి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
2016 EICMA Motorcycle Show: Hero MotoCorp Debuts Dawn 125 Motorcycle
Please Wait while comments are loading...

Latest Photos