విపణిలోకి హీరో అచీవర్ 150 విడుదల: ప్రారంభ ధర రూ. 61,800 లు

By Anil

హీరో మోటోకార్ప్, భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ నేడు ఇండియన్ మార్కెట్లోకి అచీవర్ 150 ని విడుదల చేసింది. హీరో ఈ కొత్త తరం అచీవర్ 150 లో తమ అధునాతన ఐ3ఎస్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది.

హీరో అచీవర్ 150 ధర వివరాలు

హీరో అచీవర్ 150 ధర వివరాలు

  1. అచీవర్ 150 డ్రమ్ వేరియంట్ ధర రూ. 61,800 లు
  2. అచీవర్ 150 డిస్క్ వేరియంట్ ధర రూ. 62,800 లు
రెండు ధరలు ఆన్ రోడ్ ఢిల్లీగా ఉన్నాయి.

హీరో అచీవర్ 150

సరికొత్త 2016 అచీవర్ 150 లో హీరో దేశీయంగా అభివృద్ది చేసిన 149.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

హీరో అచీవర్ 150

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 13.4బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 12.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హీరో అచీవర్ 150

బిఎస్-IV ఉద్గార నియమాలు పాటించే ఈ ఇంజన్‌కు ఐ3ఎస్ పరిజ్ఞానాన్ని అందించారు. ఆటోమేటిక్‌గా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ ద్వారా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది.

హీరో అచీవర్ 150

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ను వెనుక చక్రానికి సరఫరా చేయడానికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

హీరో అచీవర్ 150

సరికొత్త 2016 అచీవర్ 150 కేవలం ఐదు సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది.

హీరో అచీవర్ 150

సరికొత్త 2016 అచీవర్ 150 లో ముందు వైపు చక్రానికి ఆప్షనల్‌గా 240ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకును అందించారు.

హీరో అచీవర్ 150

డిజైన్ పరంగా ముందు వైపున ఉన్న హెడ్ ల్యాంప్‌ను అర్థ సమాంతర చతుర్భుజ ఆకారంలో అందించారు, పెద్ద పరిమాణంలో ఉన్న ఇంధన ట్యాంకు దీనికి మంచి కండలు తిరిగిన రూపాన్ని అందించింది. ఇక బాడీ మీద చిన్న పాటి గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి.

హీరో అచీవర్ 150

2016 అచీవర్ 150 మూడు విభిన్న రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అవి, పాంథర్ బ్లాక్ మెటాలిక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్ మరియు ఎబోనే గ్రే మెటాలిక్.

హీరో అచీవర్ 150

సుమారుగా 700 లక్షల సంతృప్తి చెందిన వినియోగదారులను గ్రహించినందుకు, సరికొత్త అచీవర్ ను స్పెషల్ ఎడిషన్ రూపంలో విడుదల చేసింది.

హీరో అచీవర్ 150

దేశవ్యాప్తంగా కేవలం 70 అచీవర్ బైకులను మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.

హీరో అచీవర్ 150

  • భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!
  • సంచలనాలు సృష్టించిన టూ వీలర్లు...!!
  • లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు

Most Read Articles

English summary
Read In Telugu: Hero Achiever 150 Launched In India; Prices Start At Rs. 61,800
Story first published: Monday, September 26, 2016, 18:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X