మార్కెట్ నుండి మాయెస్ట్రో స్కూటర్‌ను తొలగిస్తున్న హీరో

నూతన మోడళ్ల విడుదల మీద దష్టిసారించడం కోసం హీరో మోటోకార్ప్ తమ ఫోర్ట్‌ఫోలియో నుండి మాయెస్ట్రో స్కూటర్‌ను తొలగిస్తోంది.

Written By:

ఇండియన్ స్కూటర్ల మార్కెట్లో అత్యంత పాపులర్ మోడల్స్‌లో హీరో మాయెస్ట్రో ఒకటి. గత ఏడాది ప్రారంభంలో ఈ మాయెస్ట్రో యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ మాయెస్ట్రో ఎడ్జ్ ను విడుదల చేసింది. దీనితో పాటుగానే మాయెస్ట్రో పాత మోడల్‌ను యథావిధిగా అమ్మకాలకు ఉంచింది.

పాత మోడళ్లను తమ ఫోర్ట్ పోలియో నుండి తొలగించి నూతన ఉత్పత్తుల విడుదలకు సిద్దమైంది హీరో మోటోకార్ప్. అందులో భాగంగానే పాత మాయెస్ట్రో ను తమ లైనప్‌ నుండి తొలగించాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం డీలర్ల వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే పాత మాయెస్ట్రో స్కూటర్లను ఎంచుకోగలరు, అయితే ముందుకు వీటిని ఉత్పత్తి చేసే ఆలోచనలో అయితే లేదు.

భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను లైనప్‌ నుండి తొలగించి నూతన ఉత్పత్తుల యొక్క అభివృద్ది మరియు విడుదల మీద దృష్టిపెట్టినట్లు హీర మోటోకార్ప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాయెస్ట్రో ఎడ్జ్ పూర్తిగా కొత్త మోడల్. డిజైన్ పరంగా నూతన వేదిక మీద అభివృద్ది చేయడం జరిగింది.

మాయెస్ట్రో ఎడ్జ్ ధర పాత మాయెస్ట్రో స్కూటర్ ధర కన్నా రూ. 1,000 లు మాత్రమే అదనంగా ఉంది. ఈ ధరకే మాయెస్ట్రో ఎడ్జ్ ను అందుబాటులోకి తీసుకురావడం హీరో మోటోకార్ప్‌కు కాస్త కఠినమైన అంశమే అని చెప్పాలి.

సరికొత్త మాయెస్ట్రో ఎడ్జ్ లో 110సీసీ సామర్థ్యం గల సౌకర్యవంతమైన రైడింగ్ కు అవకాశం ఉన్న సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌లో ఎక్ట్సర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్, 12-అంగుళాల ఫ్రంట్ వీల్, డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లున్నాయి.

ప్రస్తుతం హీరో లైనప్‌లో ఉన్న మాయెస్ట్రో ఎడ్జ్ ఎల్ఎక్స్ మరియు విఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభించును. వీటి ధరలు వరుసగా రూ. 49,930 లు మరియు 51,380 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు.....
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ బైకులను విపణికి పరిచయం చేసింది. రెండు రోజుల క్రితం నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టిన ఈ మోడల్ నేడు విపణిలోకి చేరింది. ధర మరియు ఇతర వివరాలు కోసం...

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Hero MotoCorp Discontinues The Maestro From Its Product Portfolio
Please Wait while comments are loading...

Latest Photos