ఈ జనవరికి కొత్త బైకును విడుదల చేయనున్న యమహా

Written By:

యమహా ఇండియా జనవరి 2017 లో సరికొత్త మోటార్ సైకిల్ విడుదలకు సిద్దమవుతోంది. దీనికి సంభందించిన టీజర్ ను విడుదల చేసింది. యమహాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎఫ్‌జడ్ సిరీస్ లో ఈ బైకును విడుదల చేయనున్నట్లు తెలిసింది.

యమహా ఇండియా ఈ సరికొత్త మోటార్ సైకిల్ ఇండియన్ రోడ్ల మీద ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది. ఈ ఫోటోలను గమనిస్తే ఎఫ్‌జడ్ సిరీస్ లోకి మరో మోడల్‌ను విడుదల చేస్తోందనే విషయం స్పష్టమవుతుంది.

రహస్యంగా పరీక్షించబడిన ఈ మోటార్ సైకిల్ దాదాపుగా ఎఫ్‌జడ్ డిజైనింగ్ లక్షణాలను కలిగి ఉంది. అయితే ఇందులోని ఇంజన్ వివరాలు తెలియరాలేదు.

ప్రస్తుతం సమాచార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, యమహా పాపులర్ వెర్షన్ 250 సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.

పరీక్షించబడిన బైకును గమనిస్తే ప్రస్తుతం విక్రయాల్లో ఉన్నటువంటి ఎఫ్‌జడ్ మోడల్ లోని ఎగ్జాస్ట్ సిస్టమ్ ను పోలి ఉంటుంది. ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు ఇరు వైపులా డిస్క్ బ్రేకులను ఇందులో గుర్తించవచ్చు.

యమహా ఇందులో ముందువైపున కన్వెన్షనల్ తరహా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

యమహా ఈ మోటార్ సైకిల్ ను 250సీసీ సామర్థ్యం గల ఇంజన్ తో విడుదల చేస్తే ఇది 23 నుండి 26బిహెచ్‌పి మధ్య పవర్ మరియు 22 నుండి 25ఎన్ఎమ్ మధ్య గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం.

దేశీయంగా పర్ఫామెన్స్ బైకుల అమ్మకాలు పుంజుకుంటున్న నేపథ్యంలో యమహా తన ప్రభావాన్ని చాటుకోవడానికి ఈ ఏడాది ప్రారంభంలోనే దీని విడుదలకు సిద్దమవుతోంది.

 

మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్ (telugu.drivespark.com/)

12,000 కిమీల పొడవైన లండన్-చైనా రైలు ప్రారంభం
చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది.

ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్కూటర్ ను విడుదల చేయనున్న హోండా
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి తమ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ సిఆర్ఎఫ్1000ఎల్ ను జూలై 2017 నాటికి విడుదల చేయనుంది.

 

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha India Teases A New Motorcycle Ahead Of Its Launch In January
Please Wait while comments are loading...

Latest Photos