ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014 హోండా సిబిఆర్500ఆర్ ఆవిష్కరణ

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన సరికొత్త 500సీసీ బైక్ 'హోండా సిబిఆర్500ఆర్' (Honda CBR500R)ను మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) తమ సిబిఆర్ సిరీస్‌లో కొత్తగా 500సీసీ ఇంజన్‌తో కూడిన కొత్త హోండా సిబిఆర్500ఆర్‌ను విడుదల చేయనుంది. దీంతో పాటుగా మరికొన్ని హై-ఎండ్ బైక్‌లను, కొత్త సిబిఆర్ సిరీస్ బైక్‌లను కూడా హెచ్ఎమ్ఎస్ఐ ప్రదర్శించే అవకాశం ఉంది.

Advertisement

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో సిబిఆర్ సిరీస్‌లో సిబిఆర్150ఆర్, సిబిఆర్250ఆర్ (ఏబిఎస్, నాన్-ఏబిఎస్) మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఈ సిరీస్‌లోకి తాజాగా వచ్చిన చేరనున్న కొత్త హోండా సిబిఆర్500ఆర్ స్పోర్ట్స్ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..!

హోండా నుంచి కొత్తగా రానున్న ఈ పవర్‌ఫుల్ సిబిఆర్500ఆర్ బైక్‌లో 500సీసీ, పారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పిల శక్తిని, 43 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త హోండా సిబిఆర్500ఆర్ కేవలం 5.7 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

భారత మార్కెట్లో కొత్త హోండా సిబిఆర్500ఆర్ బైక్ కూడా ఏబిఎస్, నాన్-ఏబిఎస్ ఫీచర్లతో లభ్యం కావచ్చని తెలుస్తోంది. దేశీయ విపణిలో దీని ధర రూ.4 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా.

హోండా సిబిఆర్500ఆర్ ఈ సెగ్మెంట్లోని కవాసకి నిన్జా500, కెటిఎమ్ డ్యూక్390 వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది. ఈ బైక్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

TRENDING

English Summary

Japanese two-wheeler manufacturer Honda has confirmed the launch of new CBR500R in India. The Honda CBR500R will be revealed at the upcoming Indian Auto Expo in February 2014. Stay tuned for latest updates.
Advertisement