హోండా డబ్ల్యుఆర్-వి

హోండా డబ్ల్యుఆర్-వి
Style: ఎస్‌యూవీ
8.90 - 11.90 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

హోండా ప్రస్తుతం 4 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. హోండా డబ్ల్యుఆర్-వి ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, హోండా డబ్ల్యుఆర్-వి ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా హోండా డబ్ల్యుఆర్-వి మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి హోండా డబ్ల్యుఆర్-వి గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

హోండా డబ్ల్యుఆర్-వి పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
8,90,375
ఎస్‌యూవీ | Gearbox
10,03,316

హోండా డబ్ల్యుఆర్-వి డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
10,91,437
ఎస్‌యూవీ | Gearbox
11,89,925

హోండా డబ్ల్యుఆర్-వి మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 16.5
డీజిల్ 23.7

హోండా డబ్ల్యుఆర్-వి రివ్యూ

Rating :
హోండా డబ్ల్యుఆర్-వి Exterior And Interior Design

హోండా డబ్ల్యుఆర్-వి ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

హోండా డబ్ల్యుఆర్-వి భారతీయ మార్కెట్లో ఉన్న బ్రాండ్ యొక్క కాంపాక్ట్ ఎస్‌యూవీ సమర్పణ. డబ్ల్యుఆర్-వి కొంతకాలంగా భారతదేశంలో అమ్మకానికి ఉంది. అంతే కాకుండా ఇది ఇటీవల ఫేస్‌లిఫ్ట్‌ను పొందింది. ఇది దాని పాత మోడల్‌తో పోలిస్తే ఈ ఎస్‌యూవీ మరింత అప్‌డేట్ మరియు రిఫ్రెష్ లుక్ పొందింది.

హోండా డబ్ల్యుఆర్-వి యొక్క డిజైన్ గమనించినట్లయితే ఇది కొంత రిఫ్రెష్ స్టైలింగ్‌తో వస్తుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్ ఉంది, బ్రాండ్ యొక్క సిగ్నేచర్ క్రోమ్ బార్ దాని మధ్యలో ‘హెచ్’ తో ఉంటుంది. గ్రిల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో అనుసంధానించబడిన ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో ఉంటుంది. ఫ్రంట్ బంపర్ ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్‌ను ఇరువైపులా స్పెషల్ హౌసింగ్‌లలో కలిగి ఉంటుంది.

హోండా డబ్ల్యుఆర్-వి యొక్క సైడ్ ప్రొఫైల్‌ 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ బ్లాక్ క్లాడింగ్, రూప్ రైల్స్ బ్లాక్ కలర్ లో మరియు పెద్ద విండోస్ తో పూర్తయ్యాయి. డబ్ల్యుఆర్-వి బాడీ కలర్ ORVM లతో వస్తుంది, ఇవి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్. ఇక డబ్ల్యుఆర్-వి వెనుక వైపు గమనించినట్లయితే ఇది ఎల్ఈడి టెయిల్ లైట్లను స్మోక్డ్ ట్రీట్మెంట్ తో పాటు పాటు కొద్దిగా ట్వీక్డ్ రియర్ బంపర్ కూడా ఉంది.

హోండా డబ్ల్యుఆర్-వి ఇంజన్ మరియు పనితీరు

హోండా డబ్ల్యుఆర్-వి Engine And Performance

హోండా డబ్ల్యూఆర్-వి రెండు బిఎస్ 6 ఇంజన్ ఆప్షన్లతో పనిచేస్తుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 65 బిహెచ్‌పి మరియు 110 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇక డీజిల్ యూనిట్ విషయానికి వస్తే, ఇది 1.5 లీటర్ ఇంజన్ రూపంలో వస్తుంది. ఇది 71 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఫిగర్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హోండా డబ్ల్యుఆర్-వి ఇంధన సామర్థ్యం

హోండా డబ్ల్యుఆర్-వి Fuel Efficiency

1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 16.5 కి.మీ / లీ మైలేజీని ఇస్తుందని, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 23.7 కి.మీ / లీ మైలేజ్ ఇస్తుందని హోండా పేర్కొంది. అన్ని గణాంకాలు ARAI- ధృవీకరించబడినవి. ఇది వివిధ బాహ్య కారకాలపై ఆధారపడి వాస్తవ ప్రపంచంలో మైలేజ్ విషయంలో కొంత మార్పు రావచ్చు.

ఇంధన సామర్థ్య గణాంకాలతో కూడిన డీజిల్ ఇంజిన్ 40-లీటర్ ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సారి ఫుల్ ట్యాంక్ తో దాదాపు 900 కిలోమీటర్ల దూరాన్ని అందించగలదు.

హోండా డబ్ల్యుఆర్-వి ముఖ్యమైన ఫీచర్లు

హోండా డబ్ల్యుఆర్-వి Important Features

హోండా డబ్ల్యుఆర్-వి ఆఫర్‌లో ఉన్న అన్ని వేరియంట్లలో అనేక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంది. వీటిలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ & ఫోల్డబుల్ ఓఆర్‌విఎంలు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కీలెస్ ఎంట్రీ, ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

డబ్ల్యుఆర్-వి యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా, సీట్‌బెల్ట్ వార్ణింగ్, హై-స్పీడ్ అలర్ట్, సీట్-బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటివి ఉన్నాయి.

హోండా డబ్ల్యుఆర్-వి తీర్పు

హోండా డబ్ల్యుఆర్-వి Verdict

కొత్త హోండా డబ్ల్యుఆర్‌-వి ఎస్‌యూవీ డిజైన్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా, హోండా ప్రత్యేకమైన కస్టమర్ సర్కిల్‌ను కొనసాగిస్తూనే ఉంది, ఎందుకంటే ఇది తగినంత సాంకేతిక మరియు భద్రతా లక్షణాలతో నమ్మకమైన ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. అయినప్పటికీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందిస్తే మరింత సమర్థవంతమైన ఇంజిన్ ఎంపికలు మరింత మెరుగ్గా ఉంటాయి.

హోండా డబ్ల్యుఆర్-వి హోండా డబ్ల్యుఆర్-వి కలర్లు


Modern Steel Metallic
Golden Brown Metallic
Premium Amber Metallic
Radiant Red Metallic
Lunar Silver Metallic
Platinum White Pearl

హోండా డబ్ల్యుఆర్-వి పెట్రోల్ కాంపిటీటర్స్

హోండా డబ్ల్యుఆర్-వి డీజిల్ కాంపిటీటర్స్

హోండా డబ్ల్యుఆర్-వి పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

 • రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్
  local_gas_station పెట్రోల్ | 20.53
 • హ్యుందాయ్ వెన్యూ హ్యుందాయ్ వెన్యూ
  local_gas_station పెట్రోల్ | 18.2
 • మహీంద్రా ఎక్స్‌యువి300 మహీంద్రా ఎక్స్‌యువి300
  local_gas_station పెట్రోల్ | 17

హోండా డబ్ల్యుఆర్-వి డీజిల్ మైలేజ్ కంపారిజన్

 • కియా సోనెట్ కియా సోనెట్
  local_gas_station డీజిల్ | 24.1
 • టాటా నెక్సాన్ టాటా నెక్సాన్
  local_gas_station డీజిల్ | 22.4
 • హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ క్రెటా
  local_gas_station డీజిల్ | 21

హోండా హోండా డబ్ల్యుఆర్-వి ఫోటోలు

హోండా డబ్ల్యుఆర్-వి Q & A

భారత మార్కెట్లో హోండా డబ్ల్యుఆర్‌-వి కి ప్రత్యర్థులు ఏవి?

హోండా డబ్ల్యుఆర్-వి కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ఉంది. ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
హోండా డబ్ల్యుఆర్‌-వి ఆఫర్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?

హోండా డబ్ల్యుఆర్-వి రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఎస్‌వి మరియు విఎక్స్.

Hide Answerkeyboard_arrow_down
హోండా డబ్ల్యుఆర్‌-వి లోని కలర్ అప్సన్స్ ఏవి ?

హోండా డబ్ల్యుఆర్-వి ఆరు కలర్ అప్సన్లలో వస్తుంది. అవి ప్రీమియం అంబర్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మోడరన్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ & రేడియంట్ రెడ్ మెటాలిక్ కలర్స్.

Hide Answerkeyboard_arrow_down
హోండా డబ్ల్యుఆర్‌-వి మరియు హ్యుందాయ్ వెన్యూ లలో, ఏది మంచిది?

హ్యుందాయ్ వెన్యూ ఖచ్చితంగా భారత మార్కెట్లో మెరుగైన కాంపాక్ట్-ఎస్‌యూవీ ఆఫర్.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X