చిన్న కార్ సెగ్మెంట్లో హోండా తొలి అడుగు: హోండా బ్రయో

కేవలం రూ.3.95 లక్షల ప్రారంభ ధరకే బ్రయో చిన్న కారును కంపెనీ విడుదల చేసింది. 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌తో లభ్యమయ్యే హోండా బ్రయో నాలుగు వేరియంట్లు, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. విశాలమైన ఇంటీరియర్లను ఆఫర్ చేస్తున్నప్పటికీ తమ బ్రయో చిన్న కారేనని, ఈ కారు విడుదలతో హోండా భారత కార్ మార్కెట్లోని చిన్న కార్ల విభాగంలోకి ప్రవేశించినట్లయిందని తెలిపారు.
హోండా బ్రయోలో అమర్చిన 1200 సీసీ ఇంజన్ పెట్రోల్ (1.2 లీటర్ ఐ-విటెక్) ఇంజన్‌ను కలిగి ఉండి, 88 బిహెచ్‌పిల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, పవర్ విండోస్ వంటి ఫీచర్లే కాకుండా, యూఎస్‌బి, ఆక్స్ కనెక్టివిటీతో కూడిన 4స్పీకర్ 2డిన్ స్టీరియో సిస్టమ్ కూడా లభిస్తుంది.
హోండా బ్రయో చిన్న కారు ఎనర్జిటిక్ బ్లూ, ర్యాల్లీ రెడ్, అర్బన్ టైటానియం, ఆల్బస్టర్ సిల్వర్, టాఫ్ఫెటా వైట్ మరియు క్రిస్టల్ బ్లాక్ పెరల్ అనే ఆరు ఆకర్షనీయమై రంగుల్లో లభ్యమవుతుంది. హోండా బ్రయో 3610 మి.మీ. పొడవును, 1680 మి.మీ. వెడల్పును, 1500 మి.మీ. ఎత్తును మరియు 2345 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. హోండా బ్రయో లీటరుకు 18.4 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








