మారుతి స్విఫ్ట్‌కు సొట్ట పెట్టేందుకు వచ్చిన కొత్త విస్టా

ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ కొత్త విస్టా ధర రూ. 3.88 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉండగా డీజిల్ వేరియంట్ కొత్త విస్టా కారు ధర రూ. 4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త విస్టాను శక్తివంతమైన ఇంజన్, సరికొత్త లుక్, ఆకర్షనీయమైన ఇంటీరియర్స్‌తో టాటా మోటార్స్ తీర్చిదిద్దింది.
కొత్త విస్టాను నడుపుతుంటే సెడాన్ కారు నడుపుతున్న అనుభూతి కలుగుతుందని టాటా మోటార్స్ పేర్కొంది. సరికొ కొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ట్రిపుల్ బారల్ హెడ్ పాంప్, అల్లాయ్ వీల్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, 2-డిఐఎన్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్, మిర్రర్ అడ్జస్ట్ విత్ జాయ్ స్టిక్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వంటి ప్రధాన ఫీచర్లతో ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఇది లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








