ప్రస్తుత సంవత్సరంలో విడుదలైన చిన్న కార్లు

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి ఆటో కంపెనీలు పోటీపడి మరీ చిన్న కార్లను ప్రవేశపెట్టాయి. 2011 సంవత్సరంలో విడుదలైన చిన్న కార్ల వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే...
హ్యుందాయ్ ఇయాన్:
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి ఆల్టోకు గట్టి పోటీ ఇచ్చేలా అత్యంత తక్కువ ధరతో, మంచి లుక్, ఆకర్షనీమైన ఫీచర్స్‌ను కలిగి ఉండేలా హ్యుందాయ్ మోటార్ ఇండియా రూపొందించిన తమ చౌక కారు ఇయాన్‌ను అక్టోబర్ 13న భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.2.69 లక్షల నుండి రూ.3.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ దీని ధరను నిర్ణయించింది.
హ్యుందాయ్ ఇయాన్ కారులో 3-సిలిండర్, 814 సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. హ్యుందాయ్ ఇయాన్ ప్రతి లీటర్ పెట్రోల్‌కు 21.1 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇంకా ఇందులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇమ్మొబిలైజర్, వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది ఆరు వేరియంట్లలో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








