అక్టోబర్‌లో విడుదలైన కార్లు - ప్రిమీయర్ రియో ఎస్‌యూవీ

నాలుగు వేరియంట్లలో లభించే ప్రిమీయర్ రియో పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.4.97 లక్షల నుండి రూ.5.87 లక్షల (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) మధ్యన ఉన్నాయి. ఇందులో పవర్ స్టీరింగ్, ఫోల్డబిల్ రియర్ సీట్, ఏబిఎస్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్ మరియు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ వంటి మరెన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి.
ప్రీమియర్ రియో ఎస్‌యూవీలో అమర్చిన 1173సీసీ పెట్రోల్ ఇంజన్ 75.5 బిహెచ్‌పిల శక్తిని, 103.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రిమీయర్ రియో పెట్రోల్ వేరియంట్ ఎస్‌యూవీ లీటరుకు 15 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








