అక్టోబర్ నెలలో విడుదలైన కార్లు, వివరాలు

అక్టోబర్ నెలలో ఆడి దేశీయ విపణిలో అందిస్తున్న ఏ-సిరీస్‌లో ఓ చౌక సెడాన్‌ను 'ఆడి ఏ-6' ప్రవేశపెట్టగా, రోల్స్ రాయిస్ అందిస్తున్న ఘోస్ట్ సెలూన్‌లో పెద్ద వీల్‌బేస్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న వెరిటో సెడాన్‌లో ఓ స్పెషల్ ఎడిషన్, ఫోర్డ్ అందిస్తున్న ఎండీవర్ ఎస్‌యూవీలో ఓ స్పెషల్ ఎడిషన్, ప్రీమియర్ అందిస్తున్న రియో ఎస్‌యూవీలో ఓ పెట్రోల్ వేరియంట్, మారుతి సుజుకి అందిస్తున్న అల్టోలో ఓ లిమిటెడ్ ఎడిషన్ మరియు హ్యుందాయ్ నుండి ఇయాన్ కార్లు విడుదలయ్యాయి.
లిమిటెడ్ ఎడిషన్ హారికేన్ ఎండీవర్ ఎస్‌యూవీని విడుదల చేసిన ఫోర్డ్:
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) 'ఎండీవర్'లో ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఫోర్డ్ అందిస్తున్న ఈ 'హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్' ఎస్‌యూవీ ధర రూ.20.13 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో లభ్యమవుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ఫోర్డ్ ఎండీవర్ ధర కన్నా రూ.40,000 అధికంగా ఉన్న హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్‌లో కొత్త హెఫ్టీ ఫ్రంట్ నడ్జ్ బార్ (బంపర్), బాడీ డెకాల్స్ (హారికేన్ స్టిక్కర్‌తో బాడీ గ్రాఫిక్స్), ఐదవ (రియర్) డోర్‌పై అమర్చిన కన్వెక్స్ మిర్రర్, సరికొత్త క్రోమ్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్) వంటి ఫీచర్లు లభిస్తాయి.
ఇందులో డివిడి ప్లేయర్‌తో కూడిన టచ్-స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభించనుంది. స్పోర్టీ లుక్‌తో ఏడుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే హారికేన్ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ జర్నీలకు కూడా చక్కగా సరిపోతుంది. ఇందులో ఉపయోగించిన 3-లీటర్ డ్యురాటెక్ టిడిసిఐ కామన్-రైల్ డీజిల్ ఇంజన్ మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








