బీట్ డీజిల్ ఇంటీరియర్స్ వర్సెస్ ఫిగో డీజిల్ ఇంటీరియర్స్

ఇక ఈ కార్లలలో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే.. డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఇంటెలిజెంట్ సెంట్రల్ లాకింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఫోర్డ్ ఫిగో డీజిల్ సొంతం. చెవర్లే బీట్ డీజిల్ కూడా ఏబిఎస్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, సెంట్రల్ లాకింగ్, ఆటో ఏసి, యూఎస్‌బి మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీ ఆప్షన్ కలిగిన ఆడియో సిస్టమ్,అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ప్రధాన ఫీచర్లతో లభిస్తుంది.
అయితే, బీట్ డీజిల్ కారు కొనుగోలుదారులను నిరుత్సాహపరిచే విషయం ఏంటంటే.. ఎబిఎస్, అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు బీట్ కారులో కావాలనుకుంటే అది హై-ఎండ్ వేరియంట్ అయినా సరే కొనుగోలుదారులు అదనంగా సొమ్మును చెల్లించక తప్పదు. కానీ ఫిగో హై-ఎండ్ వేరియంట్ ఫిగో టైటానియంలో మాత్రం ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండానే ఈ ఫీచర్లు లభిస్తాయి.
అయితే, బీట్ కొనుగోలుదారులు ఈ ఫీచర్లన్నింటినీ కలిగిన బీట్ ఆప్షన్ ప్యాక్‌ను ఎన్నుకుంటే.. దాని ధర దాదాపు ఫిగో టైటానియం కారు ధరకు ఇంచు మించు సమానంగా ఉంటుంది.
ఫోర్డ్ ఫిగో కొలతలు:
* పొడవు = 3795mm, వెడల్పు = 1680mm, ఎత్తు = 1453mm, వీల్‌బేస్ = 2489mm
చెవర్లె బీట్ కొలతలు:
* పొడవు = 3640 mm, వెడల్పు = 1595 mm, ఎత్తు = 1520 mm, వీల్‌బేస్ = 2375 mm


Click it and Unblock the Notifications








