బీట్ డీజిల్ ఎక్స్టీరియర్స్ వర్సెస్ ఫిగో డీజిల్ ఎక్స్టీరియర్స్

ప్యాసింజర్ కార్ మార్కెట్లోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో బీట్, ఫిగోలు హాటెస్ట్ కార్లని చెప్పవచ్చు. వీటి విశిష్టమైన డిజైన్‌లను ఇష్టపడని వారుండరు. కొత్త బీట్ డీజిల్ ఆకర్షనీమైన బాడీ లైన్స్, గ్రాఫిక్స్, డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లతో స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఫిగో కూడా మంచి లుక్, ఆకర్షనీమైన కలర్స్‌తో ఓ ప్యామిలీ కార్ అనుభూతిని కల్పిస్తుంది.
ఫిగో ముందు భాగాన్ని పరిశీలిస్తే.. చాలా చిన్న గ్రిల్‌తో పెద్ద హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. అయితే, బీట్ మాత్రం కొంచెం మందమైన గ్రిల్‌ను కలిగి ఉండి షార్ప్ హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. ఈ రెండు కార్లను ముందువైపు నుంచి గమనిస్తే.. ఫిగో చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఇక బీట్ విషయానికి వస్తే.. అందమైన హెడ్‌లైట్లతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
బీట్ డీజిల్ కారు చూడటానికి కొంచెం ఎత్తుగా ఉంటే, ఫిగో మాత్రం ఎత్తు తక్కువ ఉండి పొడవుగా ఉంటుంది. బీట్ కారులో మరో ముఖ్యమైన ఎక్స్టీరియర్ ఫీచర్ ఏంటంటే కారు రూఫ్ (పైకప్పు)పై ఉండే రూఫ్ రైల్స్ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. కానీ ఫిగోలో రూఫ్ రైల్స్ లేవు.


Click it and Unblock the Notifications








