పాల్-వి ఫ్లయింగ్ కార్ ప్రత్యేకతలు - పార్ట్ 2
పాల్-వి గాల్లోకి ఎగరాలంటే కనీసం 165 మీటర్ల (540 అడుగులు) స్థలం/రోడ్డు అవసరమవుతుంది. అయితే, ఇది ల్యాండ్ కావడానికి కేవలం 30 మీటర్ల (100 అడుగులు) స్థలం/రోడ్డు సరిపోతుంది. ఒక్కసారి ఇది గాలిలో గంటకు 180 కి.మీ. వేగాన్ని పుంజుకున్న తర్వాత కేవలం గంటకు 50 కి.మీ. వేగంతో ఫ్లైట్‌ను లెవల్ చేయవచ్చు. ఫ్లయిట్ మోడ్‌లో గంటకు 36 లీటర్ల ఇంధన అవసరమవుతుంది. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో గాలిలో 350-50 కి.మీ. దూరం (మోడల్ టైప్, పేలోడ్, గాలి వాటాలపై ఆధారపడి) ప్రయాణించవచ్చు.
పాల్-వి సాధారణంగా 1,200 మీటర్లకు (4,000 అడుగులు) దిగువన ఆపరేట్ చేసేలా డిజైన్ చేశారు. విజువల్ ఫ్లయింట్ రూల్స్ (విఎఫ్ఆర్) ట్రాఫిక్ నియంత్రణలేని (అంటే సాధారణ విమానాలు అస్సలు తిరగని, ఆంక్షలు లేని విమాన మార్గం అన్నమాట) గగనతలంలో ఈ ఫ్లయింగ్ కారును ఉపయోగించుకోవచ్చు. ఈలెక్కన చాలా దేశాల్లో ఈ ఫ్లయింగ్ కారును ఎలాంటి ఫ్లైట్ ప్లాన్ ఫిల్ చేయకుండానే వాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications









