డిసి డిజైన్స్ నుంచి నిస్సాన్ ఇవాలియా లాంజ్ ప్యాకేజ్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారు ఇంటీరియర్స్‌ను చూసి ఇదేదో లగ్జరీ కారు అనుకుంటున్నారా..? అయితే మీరు బ్రేకుపై కాలేసినట్లే. ఇది నిస్సాన్ ఇండియా అందిస్తున్న మేడ్ ఇన్ ఇండియా ఇవాలియా ఎమ్‌పివి. ఇటీవలే నిస్సాన్ సన్నీ సెడాన్‌ను అత్యంత విలాసవంతంగా కస్టమైజ్ చేసిన ప్రముఖ వెహికల్ కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్స్ మోడిఫై తాజాగా నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిని కస్టమైజ్ చేసింది.
డిసి డిజైన్ ఈ 7-సీటర్ ఎమ్‌పివి రూపు రేఖలనూ పూర్తిగా మార్చేసి, ఇంటీరియల్‌లో ఆరు ఫుల్ సైజ్ లగ్జరీ సీట్లు ఉండేలా, అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో దీనిని కస్టమైజ్ చేసింది. వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను అద్భుతమైన రీతిలో కస్టమైజ్ చేయటంలో చేయి తిరిగిన ప్రముఖ ఆటోమోటివ్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ గతంలో అనేక కార్లను ఇలా కస్టమైజ్ చేసి ఔరా అనిపించుకుంది.
మరి డిసి స్టయిల్‌లో వచ్చిన ఈ డిసి ఇవాలియాలోని విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం రండి.

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా అందిస్తున్న ఇవాలియా ఎమ్‌పివి ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌లను డిసి డిజైన్స్ తమదైన శైలిలో కస్టమైజ్ చేసింది.

గతంలో డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన నిస్సాన్ సన్నీ సెడాన్ మాదిరిగానే, నిస్సాన్ ఇవాలియా ఇంటీరియర్స్‌లో కూడా డ్యూయెల్ టోన్ (రెడ్ అండ్ వైట్) కలర్ స్కీమ్‌ను ఉపయోగించారు.

డిసి ఇవాలియా వెనుక వరుసలో రెండేసి సీట్లు ఎదురెదురుగా (ఫ్రంట్ ఫేసింగ్ సీట్స్) ఉండేలా ఉంటాయి. వీటిని పూర్తిగా యాంత్రికంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రీమియం లెథర్‌తో అత్యంత సౌకర్యంగా, లగ్జరీగా ఉండేలా ఈ సీట్లను డిజైన్ చేశారు.

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన ఇవాలియాలో ఇంటీరియర్ లైటింగ్/ఇల్యూమినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

డిసి కస్టమైజ్డ్ ఇవాలియా ముందువైపు (గ్రిల్‌పై), స్టీరింగ్‌పై, అలాగే ఇంటీరియర్లపై డిసి బ్యాడ్జింగ్ ఉంటుంది.

ఇందులో మూన్ రూఫ్ మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది సన్‌రఫ్ మాదిరిగానే పనిచేస్తుంది. రాత్రివేళల్లో ఈ వైట్ కర్టెన్‌ను తొలగిస్తే, హాయిగా ఆకాశంలోని నక్షత్రాలు, చంద్రుడ్ని చూస్తూ ప్రయాణించవచ్చు.

డిసి ఇవాలియా లాంజ్ ప్యాకేజ్ రూ.3.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


కస్టమైజ్డ్ రెనో డస్టర్‌ను విడుదల చేసిన డిసి డిజైన్స్

డిసి డిజైన్స్ టొయోటా ఇన్నోవా లాంజ్ ప్యాకేజ్


Click it and Unblock the Notifications








