ఆటోమోటివ్ ప్రపంచంలో ఏడు వింతలు..! బయటపడిన అత్భుతాలు..!!

By Anil

నిరంతరం ఆటోమొబైల్స్‌కు సంభందించిన వార్తలు మరియు సమాచారాన్ని అందిస్తున్న ఈ డ్రైవ్‌స్పార్క్ పుట్టిన రోజు ఇవాలే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను ప్రత్యేకంగా మీ కోసం అందిస్తున్నాము.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పరిమాణం ఉన్న ట్రక్కు, అత్యంత ఖరీదైన కారు, అత్యంత వేగవంతమైన రాకెట్ కారు వంటి ఏడు వింతలను మీకోసం అందిస్తున్నాము.

 01.ఎక్కువ మైలేజ్ ఇవ్వగల కారు:

01.ఎక్కువ మైలేజ్ ఇవ్వగల కారు:

ప్రపంచంలో అత్యధిక మైలేజ్ ఇవ్వగల కారుగా వోక్స్‌వ్యాగన్ ఎక్స్‌యల్-1. ఇది లీటర్‌కు 111 కిలోమీటర్లు ఇస్తుందని దీనిని అమ్మకాలకు ఉంచినపుడు కంపెనీ తెలిపింది. అత్యంత మైలేజ్ ఇవ్వగల కారుగా ఇది ఎంపిక కావడం వలన దీని యాజమాని తెగ సంభరపడిపోతున్నాడు.

భారతీయ మార్కెట్లో లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల కారు

02. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ట్రక్కు:

02. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ట్రక్కు:

ఇది ప్రపంచపు అతి పెద్ద ట్రక్కులలో ఒకటి. భారీ ఉత్పత్తులు తయారుచేసే రెయిన్‌బో షెయిక్ సంస్థ నిర్మిస్తోంది. దీనిని డోడ్జి పవర్ వ్యాగన్ ట్రక్ ఆధారంతో తయారు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ట్రక్‌ను కొనుగోలు చేసిన మలోషియా సుల్తాన్.

03.రాకెట్ కారు:

03.రాకెట్ కారు:

ఇక్కడ గల రాకెట్ కారు రోల్స్-రాయిస్‌కు చెందినది. పవర్‌ని కారు యొక్క చక్రాలకు అందుతుంది. ఈ చక్రాలు నేల మీద ఉండటం వలన నేలను బలంగా వెనక్కు నెడుతాయి. అప్పుడే ఇవి అత్యదిక వేగాన్ని అందుకుంటాయి. ఇప్పటికే ఇలాంటి రెండు రాకెట్ కార్లు రికార్డును నమోదు చేసుకున్నాయి. ఇది మూడవ రాకెట్ కారు ఇది గంటకు 1,600 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

 04. అత్యంత ఖరీదైన కారు:

04. అత్యంత ఖరీదైన కారు:

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కారు బుగట్టి వేరాన్. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. మరియు అత్యిధికంగా ఉత్రత్తి అవుతున్న ఖరీదైన కార్లలో బుగట్టి వేరాన్ ముందుంది.

05. అత్యంత సన్నని కారు:

05. అత్యంత సన్నని కారు:

ట్యాంగో అనే మోడల్ కారు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సన్నని కారుగా నిలిచింది. ఈ కారు వెడల్పు మామూలు కార్ల వెడల్పులో సగం ఉంటుంది. తద్వారా ఇది ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అతి చక్కగా దూసుకుపోగలదు.

6.అత్యంత పొడవైన కారు:

6.అత్యంత పొడవైన కారు:

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన కారు ఇదే. ఈ కారు పొడవు 100 అడుగులుగా ఉంది. మరియు ఇది 26 చక్రాలను కలిగి ఉంది. ఇందులో డ్రైవర్ కోసమే ప్రత్యేకంగా రెండు క్యాబిన్‌లు ఉంటాయి. ఎంత పొడువుగా ఉన్నా ఇది సాధారణ రోడ్ల మీద తిరగడానికి అనుమతి లేదు.

07.ఆరోగ్యకరమైన వాహనం:

ఆరోగ్యకరమైన వాహనం అనగా అత్యంత శక్తివంతమైన వాహనం అని అర్థం. ఎంతంటే మిలిటరీ వాహనాల కన్నా అత్యంత శక్తివంతమైన వాహనం ఇదే. ఒక వేళ పొరపాటున దీనిని ఢీ కొట్టారా అంతే సంగతులు మరి. ఇది ఎంత శక్తివంతమైనదో ఒక సారి ప్రక్క వీడియో చూడండి.

Article Published On: Wednesday, November 11, 2015, 16:27 [IST]
English summary
Seven Wonders The Vehicular World
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+