లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్ ఆవిష్కరణ

By Anil

ప్రపంచ స్థాయిలో హైబ్రిడ్ ఇంధన సాంకేతికత గల కారును జపాన్‌కు చెందిన టయోటా కంపెని మొదటిసారిగా లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల కారును ప్రియాస్ అనే పేరుతో భారత్‌లోకి విడుదల చేయనుంది. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లి కారు అని చెప్పవచ్చు ఎందుకంటే దీని నుండి అతి తక్కువ ఉద్గారాలు విడుదల అవుతాయి. అందువలన దీనిని పర్యావరణానికి స్నేహపూర్వకమైన మోడల్‌గా చెలామణి కానుంది.

మరొక ముఖ్యమైన సమాచారం ఈ నాల్గవ తరానికి చెందిన టయోటా హైబ్రిడ్ కారును కొనే వారి కోసం వివిధ దేశాల వారు ప్రత్యేక రాయితి రాయితి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా జరిగిందంటే మరి దీనిని కొడానికి ఎంతో మంది ముందుకువస్తారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: ఇలాంటి ఆశ్చర్యకరమై ఫీచర్లున్న మరిన్ని కార్ల గురించి మీకోసం

ఈ అత్యధిక మైలేజ్ కారు గురించి మరింత సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా....

 దృఢత్వం :

దృఢత్వం :

కొత్త తరం టయోటా ప్రియాస్ కారు యొక్క ఫ్రేమ్ వర్క్‌లో దీనిని చాసి 60 శాతం దృఢంగా అభివృద్ది చేశారు. మరియు ఇది అతి తక్కువ బరువు ఉండటం వలన దీనిని హ్యాండిల్ చేయడానికి ఎంతో సులభంగా ఉంటుంది.

Also Read: మీ నగరంలో టయోటా కార్ల ధరలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంజన్ వివరాలు :

ఇంజన్ వివరాలు :

కొత్త ప్రియాస్ కారును అభివృద్దిపరిచిన 1.8-లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తున్నారు. గణనీయమైన మార్పుల తరువాత ఈ ఇంజన్‌ను అందుబాటులో ఉంచారు. ఈ గణనీయమై మార్పుల వలన ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ 40 శాతం వరకు పెరిగింది. ఇంజన్ ఎఫిషియన్సీ పెరగడం వలన దీనికి కూలింగ్‌ను రెండు విధాలుగా అందిస్తున్నారు. బహుశా ఇంత మైలేజ్ రావడానికి ఇదే ముఖ్య కారణం కావచ్చు.

ఇంజన్ యొక్క శక్తి :

ఇంజన్ యొక్క శక్తి :

ఇందులో ఉన్న 1.8- లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎక్కువగా 97 బిహెచ్‌పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరియు ఇది విధ్యుత్ మోటార్ తో కలిసి గరిష్టంగా 73 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది ఇది అంతర్గతంగా పట్టును పెంచడానికి మరింతగా ఉపయోగపడుతుంది.

 మైలేజ్ :

మైలేజ్ :

టయోటా యొక్క కొత్త కారు ప్రియాస్ మైలేజ్ లీటర్ కు 40 కిలోమీటర్లు అని కంపెని ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే ప్రియాస్‌ మోడల్ ఉన్న మరొక కారు 32.6 కిలోమీటర్/లీటర్ మైలేజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరియు ఇప్పటికే దీనినిన జపాన్ దేశంలో విడుదల చేశారు. మీ నగరంలో మీకు నచ్చిన కారు ధరను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాటరి :

బ్యాటరి :

సరికొత్త టయోటా ప్రియాస్ కారులో వెనుక సీటుకు క్రింది భాగాన నికెల్ మెటల్ బ్యాటరిని అమర్చారు. ఇలా వెనుక వైపున బ్యాటరిని ఏర్పాటు చేయడం వలన కారు యొక్క బరువు సమాంతరంగా విభజించబడినది. అందువలన ధృఢత్వం మరియు పటిష్టం రెండు పెరిగాయని చెప్పవచ్చు.

బూట్ రూమ్ స్పేస్ :

బూట్ రూమ్ స్పేస్ :

ఇందులో దాదాపుగా 502 లీటర్ల కెపాసిటి గల బూట్ స్పేస్ ఉంది. మరియు దీనిని బ్యాటరీలు సీట్ల క్రింద వైపుకు వెళ్లడం వలన మనకు స్థలం మిగిలిందని చెప్పవచ్చు, దీని వలన మరిన్ని ఎక్కువ వస్తువులను పెట్టుకోవడానికి వీలుకలిగింది.

పరిచయం :

పరిచయం :

జపాన్ దేశం యొక్క రాజధాని నగరం అయిన టోక్యో నగరంలో ఈ నెలాఖరున జరగనున్న టోక్యో ఇంటర్నేషనల్ ఆటో షోలో ఈ కొత్త తరం టయోటా ప్రియాస్‌ కారును పరిచయం చేయనున్నారు. మరియు ఈ సంవత్సరం ఆఖరికి జపాన్‌లో దీనిని అమ్మకానికి మార్కెట్లో సిద్దంగా ఉంచనున్నారు.

మరి భారత్‌లో.....

మరి భారత్‌లో.....

జపాన్‌కు చెందిన టయోటా కొత్త తరం ప్రియాస్ కారును వచ్చే ఏడాదిన భారత్‌లో విడుదల చేయనున్నారు. అయితే ఈ 40 కిలోమీటర్లు మైలేజ్‌ని ఇచ్చే కారు జపాన్ రహదారులకు మాత్రమే పరిమితం కావచ్చని కొందరి అభిప్రాయం.

More from DriveSpark

Article Published On: Friday, October 16, 2015, 11:47 [IST]
English summary
Japanese car maker Toyota Motor Corp has revealed, the fourth-generation Prius hybrid model would have listed mileage of 40 km per litre (94 mpg) in Japan, improving fuel economy by more than a fifth from the current version's 32.6 km/l.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+