క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌కు వీడ్కోలు.. సుధాకర్ స్టైల్‌లో

By Ravi

భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ ఇలా ఆయనకు ఎన్నో బిరుదులు. క్రికెట్ క్రీడా రంగంలో ఓ వెలుగు వెలిగి, భారతదేశపు సత్తాను ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేసిన మన సచిన్ టెండుల్కర్ వెస్టిండీస్‌తో ఆడిన తన ఆఖరు, 200వ టెస్టు మ్యాచ్‌తో క్రికెట్‌కు స్వస్తి పలికిన సంగతి తెలిసినదే. సచిన్‌కు ఆయన అభిమానులు తమదైన శైలిలలో వీడ్కోలు పలికుతున్నారు.

ఇది కూడా చదవండి: సచిన్ టెండుల్కర్ కార్ కలెక్షన్

ఇందులో భాగంగానే మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ కార్ డిజైనర్ సుధాకార్స్ అధినేత మరియు గిన్నిస్ బుక్ విజేత అయిన సుధాకర్, సచిన్ టెండుల్కర్ జ్ఞాపకార్థం క్రికెట్ బ్యాట్, క్రికెట్ బంతి ఆకారంలో ఉండే వాహనాలను తయారు చేసి నగర రోడ్లపై నడిపారు.

ఇది కూడా చదవండి: సుధాకార్స్ స్టేషనరీ కార్స్..

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

ఈనెల 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేషనరీ కార్లను తయారు చేసిన సుధాకర్, ఇప్పుడు సచిని జ్ఞాపకార్థం బ్యాట్, బాల్ ఆకారంలో ఉండే కార్లను తయారు చేశాడు.

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

క్రికెట్ దేవుడికి దండం అనే క్యాప్షన్‌తో సచిన్ వరల్డ్ కప్ పట్టుకొని ఉండే ఫొటోతో కూడిన బంతి ఆకారంలో ఉండే కారును సుధాకర నగర రోడ్లపై నడిపి చూపారు.

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

అలాగే క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉండే కారుపై ఇదే క్యాప్షన్‌తో పాటు అనేక సచిన్ ఫొటోలను అంటించారు. (గడచిన వరల్డ్ కప్ సమయంలో సుధాకర్ వరల్డ్ కప్ ఆకారంలో ఉండే కారును కూడా డిజైన్ చేశాడు).

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ గడచిన 25 సంవత్సరాలుగా ఇలాంటి విచిత్రమైన వాహనాలను తయారు చేస్తున్నాడు. సుధాకర్ సృజనాత్మకతను గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యాజమాన్యం అతనిని సత్కరించింది.

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

సుధాకర్ ఇప్పటివరకు 38 రకాల కార్లను వివిధ రకాల ఆకారాలలో తయారు చేశారు. డైనింగ్ టేబుల్ కార్, సోఫాసెట్ కార్, కంప్యూటర్ కార్, హెల్మెట్ కార్, క్రికెట్ బాల్ కార్, సిగరెట్ బైక్ ఇలా చెప్పుకుంటూ పోతే సుధాకర్ తయారు చేసిన కార్ల జాబితా చాంతాడంత అవుతుంది.

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

సుధాకర్ గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో 'సుధా వాకీ కార్స్ షో" పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఓ ప్రదర్శనను కూడా నిర్వహించాడు.

క్రికెట్ దేవుడికి దండం.. సుధాకర్ స్టైల్‌లో

ప్రపంచంలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని సుధాకార్ తెలిపారు. ఈ షోలో వివిధ బంతుల ఆకారంలో ఉండే కార్లు, ఫార్ములా వన్ డిజైన్ కలిగిన కారు, కాఫీ మగ్ ఆకారంలో ఉండే కారు వంటి ఎన్నో డిజైన్లను ఆయన ప్రదర్శించారు.

సచిన్ టెండుల్కర్ కార్ కలెక్షన్
సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, November 18, 2013, 10:52 [IST]
English summary
A tribute to the cricket legend! Sudhakar Yadav Popular Car designer made Bat and Boll shaped cars to pay tribute to the cricket legend Sachin Tendulkar at Bhadurpure in old city of Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+