ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన ఛార్జింగ్ పాయింట్లను రూపొందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటిని "లో-కాస్ట్ ఏసి ఛార్జ్‌పాయింట్" (ఎల్‌ఐసి) అని పిలుస్తారు. దేశంలోని వివిధ ఆటో మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ సరఫరాదారుల సంయుక్త ప్రయత్నాల ద్వారా ఇది అభివృద్ధి చేయబడింది.

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఈ లో-కాస్ట్ ఏసి చార్జ్‌పాయింట్‌ను ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ కార్యాలయం నేడు ఆవిష్కరించింది. ఈ చార్జింగ్ పోర్టులు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను ఛార్జ్ చేయడానికి 3 కిలోవాట్ల వరకు శక్తిని అందిస్తాయి. ఈ ఛార్జ్ పాయింట్‌ను కస్టమర్ యొక్క స్మార్ట్‌ఫోన్ నుండి ఆపరేట్ చేయవచ్చు మరియు చెల్లింపులు కూడా చేయవచ్చు.

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

దేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నితి ఆయోగ్ సహాయంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు వినియోగాన్ని ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంది. అంతేకాకుండా, దేశంలో ఈవీల డిమాండ్ మరియు ఉత్పత్తిని మెరుగుపరచడానికి, భారత సర్కార్ ఫేమ్-2 పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ, దేశంలో ఈవీల కోసం సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం కారణంగా, వీటిని స్వీకరించే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది. ప్రస్తుతం, దేశంలోని మొత్తం వాహన అమ్మకాలలో పెట్రోల్/డీజిల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు మరియు త్రీ-వీలర్లు 84 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఈ నేపథ్యంలో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలను మరియు కొత్త ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే, ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులను రూపొందించారు. అంతేకాదు, ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా కూడా ఉంటాయి.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఈ లో-కాస్ట్ ఏసి చార్జ్‌పాయింట్ ధర కేవలం రూ.3,500 మాత్రమే. వీటిని ఇన్‌స్టాల్ చేయటం కూడా చాలా సులువు మరియు వీటి కోసం ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. రానున్న రోజుల్లో ఇవి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయగలవని భావిస్తున్నారు.

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఈ చార్జింగ్ పాయింట్లు బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీని కలిగి ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వీటిని యాక్సెస్ చేసుకోవటం మరియు చార్జింగ్ ముగిసిన తర్వాత చెల్లింపులు చేయటం చేవచ్చు. ఈ చార్జింగ్ పోర్టులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఈ లో-కాస్ట్ ఛార్జ్‌పాయింట్‌ను 220 వోల్ట్ 15 యాంప్స్ సింగిల్ ఫేజ్ లైన్‌తో ఏ ప్రదేశంలోనైనా ఉంచవచ్చు. మెట్రో స్టేషన్స్ మరియు రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఆఫీస్ కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్ మరియు కిరాణా షాపులు ఎక్కడైనా సరే వీటిని సులువుగా అమర్చవచ్చు మరియు ఉపయోగించవచ్చు.

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

రాబోయే 2 నెలల్లో దీనికి ఐఎస్ఐ ప్రమాణం విడుదల అవుతుంది. ఈ చార్జింగ్ కాన్సెప్ట్ ఉత్పత్తి దశకు చేరుకునే లోపుగా మన్నిక పరీక్షలు కూడా నిర్వహించబడుతాయి. ఈ పరికరాల వలన ఓ కొత్త పరిశ్రమ రంగం ఉద్భవిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వీటిని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి, వినియోగించినట్లయితే దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన ఛార్జింగ్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేయటానికి ఇవి ఎంతగానే ఉపయోగపడనున్నాయి.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

కరోనా మహమ్మారి నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాలు మంచి ఫలితాలను కనబరచలేకపోయాయి. గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6 శాతం తగ్గి 1,43,837 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో 40,836 యూనిట్లు హైస్పీడ్ వాహనాలు ఉండగా, 1,03,000 యూనిట్లు లో-స్పీడ్ వాహనాలు ఉన్నాయి.

ఈవీల కోసం అతి తక్కువ ఖర్చుతో కూడిన చార్జింగ్ పోర్టులు; త్వరలోనే దేశవ్యాప్తంగా..

ఇదే సమయంలో, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల అమ్మకాలు కూడా తగ్గముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 88,378 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు అమ్మకాలు జరిగాయి. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇవి 1,40,683 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలలో రవాణా అథారిటీలో నమోదు కాని మూడు చక్రాల వాహనాలు లేవు.

Most Read Articles

English summary
Low-cost AC Charge Point (LAC) Unveiled For EV's; To Be Installed Across India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X