రోడ్డు పక్కన BMW కారును వదిలేసి వెళ్లిపోయిన యజమాని.. అతని మాటలకు అవాక్కైన పోలీసులు.!!

ఒకప్పుడు BMW, Audi, Mercedes-Benz వంటి కంపెనీల లగ్జరీ కార్లు భారత్‌లో చాలా అరుదుగా ఉండేవి. కానీ కాలం మారుతుండటంతో.. ఈ కంపెనీల ఖరీదైన కార్లన్నీ ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ BMW 5-సిరీస్ యజమాని తనకు ఈ కారు వద్దు అని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.

లగ్జరీ కార్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రముఖులు, ధనవంతుల కార్ల జాబితాలో లగ్జరీ కార్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే లగ్జరీ కార్లన్నీ ధనవంతుల సొంతం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తనకు BMW కారు వద్దని రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. అదేంటని పోలీసులు అడిగితే అతను చెప్పిన కారణం వారిని నోరెళ్లబెట్టేలా చేసింది.

Owner-Abandoned-BMW-5-Series-Sedan

సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్న ఈ సంఘటన కేరళలోని కోజికోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇటీవల కోజికోడ్‌లోని ఒక షాపింగ్ మాల్‌కు బీఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారులో ఓ వ్యక్తి యజమాని వచ్చాడు. మాల్‌కు సమీపంలోని కొన్ని దుకాణాల ముందు కారు పార్క్ చేసి వెళ్లిపోయాడు. అయితే పార్క్‌ చేసి 5 రోజులు గడిచినా కారు తీసుకోవడానికి యజమాని రాలేదు.

కారు రోడ్డుపై పార్క్‌ చేసి ఉండటంతో అక్కడ ఇతర వ్యాపారులకు ఇదో తలనొప్పిగా మారింది. కారు పార్కింగ్‌ కారణంగా వారి వ్యాపారం కూడా దెబ్బతినడంతో.. వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. పార్క్‌ చేసిన BMW 5-సిరీస్ కారు యజమానిని గుర్తించి అతనితో వారు మాట్లాడారు.

Owner-Abandoned-BMW-5-Series-Sedan

విచారణలో ఆ వ్యక్తి చెప్పిన విషయాలను విని పోలీసులు అవాక్కయ్యారు. తన దగ్గర చాలా కార్లు ఉన్నాయని.. ఈ BMW కారు తనకి అవసరం లేదని సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే ఫొటోలు చూసినట్లయితే ఈ కారు ఢిల్లీలో రిజిస్టర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా యజమాని ఈ కారును సెకండ్‌ హ్యాండ్‌లో అతి తక్కువ ధరలో కొనుగోలు చేసినట్లుగా సమాచారం.

కాగా BMW 5-సిరీస్ కారును రోడ్డు పక్కన వదిలేసిన తర్వాత కొన్ని రోజులకు యజమాని తిరిగి అక్కడికి వచ్చాడు. అప్పుడు కారులో ఉన్న వస్తువులను మాత్రమే తీసుకుని కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున వచ్చి కారులో నుంచి వస్తువులను తీసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Owner-Abandoned-BMW-5-Series-Sedan

అయితే తను వచ్చిన విషయం అక్కడున్న ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే తెల్లవారుజామున వచ్చి సరుకులు తీసుకుని వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత కారులో నుంచి యజమాని తీసుకెళ్లిన వస్తువుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

ఈ కారును నేరగాళ్లు కొన్ని వస్తువులను స్మగ్లింగ్ చేసేందుకు ఉపయోగిస్తారా అనే ఆందోళనతో వ్యాపారులు ఉన్నారు. అయితే ఈ వైట్‌ కలర్‌ BMW 5-సిరీస్ సెడాన్ విండ్‌ షీల్డ్‌పై యజమానికి వ్యతిరేకంగా వ్యాపారులు బ్యానర్లు పెట్టారు. షాపింగ్ మాల్స్‌కు వచ్చే వారు తమ దుకాణాల ముందు వాహనాలను పార్కింగ్ చేయకూడదని బ్యానర్‌లో పేర్కొన్నారు.

Owner-Abandoned-BMW-5-Series-Sedan

అయితే మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. BMW 5 సిరీస్‌ కారులో రోడ్డుపై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న కార్లు విపరీతంగా హారన్లు మోగించడంతో విసుగు చెంది కారును రోడ్డు పక్కన వదిలేసినట్లు యజమాని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అతని మానసిక పరిస్థితిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఇప్పుడు BMW 5-సిరీస్ కారు లగ్జరీ సెడాన్ ధర రూ.68.90 లక్షలుగా ఉంది.

జీవితంలో ఎప్పటికైనా కారు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకు ఓ కారు ఉండటం అనేది వారికి ఓ లగ్జరీనే. అందుకే సొంతంగా కారు కొనుక్కుంటే ఓ పండుగలా చేసుకుంటారు. ఇంట్లో మనిషిలా భావిస్తూ అపురూపంగా చూసుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి ఇలా రోడ్డు పక్కన కారు వదిలేసి వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, October 16, 2023, 18:27 [IST]
English summary
Owner abandoned bmw 5 series luxury sedan on footpath and said cops that he has many cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+