భారతీయ ఆర్మీ యొక్క శక్తివంతమైన యుద్ద వాహనాలు మరియు ఆయుధాలు.
చైనా, భారత్ మరియు పాకిస్తాన్ ఈ మూడు దేశాలు కూడా అణు శక్తిని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. కారణం ఏ దేశానికి కూడా ఇతర దేశం మీద నమ్మకం లేకపోవడం, అన్నింటి కన్నా దేశ భద్రత మీద దృష్టితో ఇలా అణు ఆయుధ సంపదను పోగు చేసుకుంటున్నాయి. టెర్రరిస్ట్‌ల దాడులు, పొరుగు దేశాల వారి చొరబాట్లు వలన దేశ సంరక్షణ మరింత కష్టతరం అయిపోయింది ఈ నేపథ్యంలో ప్రతి దేశం కూడా అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సృష్టించుకుంటోది.
Also Read: టైటానిక్ సినిమాకు, టైటానిక్ షిప్‌కు మధ్య గల ఆశ్చర్యకరమైన సంభందాలు...!!
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ యొక్క అభివృద్ది కోసం కొన్ని బిలియన్ డాలర్ల సొమ్మును ఖర్చు పెడుతోంది. ఇందులో ఎక్కువ సొమ్మను అత్యంత పరిజ్ఞానం గల ఆధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి వెచ్చిస్తోంది. మరియు దీనికి అదనంగా భారతీయ సైన్యం కోసం స్వదేశీయంగా కొన్ని యుద్ద వాహనాలను అందించేందుకు హెచ్‌ఎయల్ వంటి చోట్ల ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
Also Read: మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!
అయితే స్వదేశీయంగా మరియు ఇతర దేశాల పరిజ్ఞానంతో భారత్ కొన్నిఅత్యాధునిక ఆయుధాలను సమకుర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భారతీయ సైన్యానికి ఎంతో బలాన్ని చేకుర్చుతోంది. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి ఎరుక అందుకే మన దేశ యుద్ద సైన్యం భారీగా నూతన యుద్ద వాహనాలను సమకుర్చుకుంది. వాటి గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం

బాలిస్టిక్ మిస్సైల్
బాలిస్టిక్ మిస్సైల్స్ రెండు కలవు అందులో ఎక్కువ ఎత్తు వరకు వెళ్లగలిగే దానిని ఫృథ్వి ఎయిర్ డిఫెన్స్ (పిఎడి) మరియు తక్కువ ఎత్తు అవసరం ఉన్న వాటికోసం అడ్వాన్స్ ఎయిర్ డిఫన్స్ వారు తయారు చేశారు. ఇవి దాదాపుగా 5000 కిలో మీటర్ల ఎత్తు వరకు చేరుకోగలవు. యాంటి బాలిస్టిక్ మిస్సైల్స్‌ను అభివృద్ది చేసుకున్న దేశాల్లో భారత్ నాలుగవ దేశంగా నిలిచింది. వరుసగా యు.యస్, రష్యా, ఇజ్రాయెల్ మరియు భారత్.

సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్
ప్రస్తుతం భారత దేశం యొక్క ప్రొటోటైప్ ఎయిర్ క్రాఫ్ట్ సుఖోయ్ టి-50. ఎప్పుడైతే రష్యా ఎమ్‌ఐజి-29 ఫల్క్రమ్ మరియు యస్‌యు-27 ఫ్లాంకర్ ఎయిర్ క్రాఫ్ట్‌లను అభివృద్ది పరిచుకుందో. అప్పుడే మన దేశంలో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ సుఖోయ్ ఎయిర్ క్రాప్ట్‌ను సృష్టించాలని నిర్ణయించుకుంది. ఈ ఐదవ తరం ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా తయారైన తరువాత లాక్‌హీడ్ మార్టిన్స్ యఫ్-22 రాఫ్టార్ మరియు యఫ్-35 లైటింగ్ ఐఐ వంటి వాటికి పోటిగా నిలిచింది.

ఐయన్‌యస్ అరిహంత్ - అణు జలాంతర్గామి
అరిహంత్ శ్రేణి జలాంతర్గామిలలో అత్యంత ప్రముఖమైనది ఈ ఐయన్‌యస్ అరిహంత్ అణు జలాతర్గామి. ఇందులో దాదారపుగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సల్ పరిజ్ఞానం కలదు. ఈ పరిజ్ఞానం ద్వారా దాదాపుగా 5,000 నుండి 6,000 టన్నుల బరువున్న వెస్సెల్ ను మోసుకెళ్లగలదు. దీనిని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ యూనిట్‌లో తయారుచేశారు.

INS విక్రమాధిత్య
భారతీయ నౌకాధళంలో ఇది కొత్త పేరు. ఈ ఐయన్‌యస్ విక్రమాధిత్య నౌకను, 1143 కెవి క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రేరణతో రూపొందించారు. దీనిని 1978-1982 వరకు నల్ల సముద్రం ఒడ్డున గల మైకొల్‌వియా, ఉక్రేనియా ఫిప్ యార్డ్‌లో రూపొందించారు. అయితే దీని స్థానంలో ప్రస్తుతం భారత నావికా దళంలో ఐయన్‌యస్ విరాట్ సేవలు అందిస్తోంది.

దస్సాల్ట్ రాఫెల్
ఈ దస్సాల్ట్ ఎయిర్ క్రాప్ట్‌లో రెండు ఇంజన్‌లు కలవు, త్రికోణాకారంలో ఉన్నాయి. ఈ 4.5-జనరేషన్ జెట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను దస్సాల్ట్ ఏవియేషన్ వారు తయారు చేసారు. దీనిని ఫ్రెంచ్ రెండు రకాలుగా ఉపయోగించుకుంటోంది. ఒకటి నావికా దళం, మరియు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్. దీనిని 2000 సంవత్సరంలో దస్సాల్ట్ ఎయిర్ ఏవియేషన్ పరిచయం చేసింది.

ఫాల్కన్ మరియు డిఆర్‌డిఒ ఎడబ్ల్యూఎసిఎస్
భారతీయ సైన్యం భవిష్యత్తు కోసం పాల్కన్ మరియు డిఆర్‌డిఒ ఎడబ్ల్యూఎసిఎస్ వారు ఉమ్మడిగా యుద్ద వాహనాలను అందించనున్నారు. అత్యంత శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్‌లను ఇది అందించగలదు అంతే కాకుండా ఇది భూమి నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ఫాల్కన్ మరియు డిఆర్‌డిఒ ఎడబ్ల్యూఎసిఎస్ ప్రస్తుతం మరిన్ని యుద్ద విమానాలను అందించే పనిలో నిమగ్నం అయ్యింది.

శౌర్య మరియు అగ్ని వి మిస్సైల్
ప్రస్తుతం భారత ప్రభుత్వ సైన్యానికి ఆయుధాలను అత్యాధునికి ఆయుధాలను అందిస్తోందని చెప్పవచ్చు. దీనికి నిదర్శనం శౌర్య మరియు అగ్ని వి మిస్సైల్. ఈ రెండు ఆయుదాలను రెండు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. మొదటి దశలో ఈ రెండు మిస్సైల్స్ దాదాపుగా 40 కిలోమీటర్ల ఎత్తు వరకు వెల్లలవు ఆ తరువాత అక్కడ నుండి నిర్దేశించిన లక్ష్యాలను నాశనం చేస్తాయి.

బ్రహ్మోస్ మరియు హైపర్ సోనిక్ బ్రహ్మోస్ II
బ్రహ్మోస్ మరియు హైపర్ సోనిక్ బ్రహ్మోస్ II ఈ రెండు క్షిపణులు కూడా భారతీయ భవిష్యత్ మిలిటరీ ఆయుధాలని చెప్పవచ్చు. ఇవి విజయ వంతంగా యుద్ద భూమిలో పోరాడుతాయి. మరియు ఇండియన్ ల్యాబొరేటరి వారు ప్రస్తుతం యస్‌యు-30ఎమ్‌కెఐ ఎయిర్ క్రాఫ్ట్‌కు పరీక్షలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిని భారతీయ సైన్యానికి అందివ్వనున్నారు.

స్పైడర్ మరియు బరాక్ - 8 స్యామ్స్
ఈ రెండింటిని మనం భారతీయ సైన్యంలో భవిష్యత్తులో చూడవచ్చు. ఇది ఒక రకమైన మిస్సైల్ అని చెప్పవచ్చు దీని ప్రత్యేక వాహనాల మీద నుండి, కొండలు, పర్వతాలు, డ్రోన్‌లు, హెలికాఫ్టర్స్ వంటి వాటి మీద చక్కగా అమర్చవచ్చు. ఈ స్పైడర్ మిస్సైల్ ద్వారా మన దేశ సైన్యానికి ప్రస్తుతం ఎంతో అవసరం ఉంది.

పి8ఐ - పోసీడోన్
ఇది కూడా మన దేశం యొక్క భవిష్యత్తు ఆయుధం. దీనిని ఇప్పటికే ఉన్న పి-8ఎ మోడల్ ను మోడిఫై చేసి రూపొందించారు. ఇది తక్కువ సమయంలో సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. ఇటువంటి వాటిని ప్రస్తుతం చాలా ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి.



Click it and Unblock the Notifications