అత్యంత ఖరీదైన బైక్‌ను విడుదల చేసిన డుకాటి: 400సీసీ స్క్రాంబ్లర్.

By Anil

డుకాటి టూవీలర్స్ సంస్థ తన అత్యంత ఖరీదైన బైక్‌ను 2015ఇఐసియమ్‌ఏ వారు నిర్వహిస్తున్న మోటార్‌ సైకిల్ షోలో ప్రదర్శించింది. అందులో దీనికి సంభందించిన అన్ని వివరాలను వెల్లడించింది.
Also Read: పాకిస్తాన్ సరిహద్దు గేటును బద్దలు కొట్టిన భారతీయుడు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగి ఉన్న ఈ మోటార్ షోలో డుకాటి సంస్థ మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే డుకాటి తన అత్యంత ఖరీదైన మోడల్-స్క్రాంబ్లర్ సిక్ట్సి2 (400సీసీ) ప్రవేశపెట్టింది.

డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2 (400సీసీ) మోడల్ బైక్ గురించి మరింత సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 ఇంజన్

ఇంజన్

డుకాటి స్క్రాంబ్లర్‌లో బైక్‌లో 399సీసీ గల యల్‌-ట్విన్ సిలిండర్ గల ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది 40.489బిహెచ్‌పి పవర్ మరియు 34.6ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో గల ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ అయిఉంది.

 అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2(400సీసీ) బైక్‌లో 10-స్పోక్స్ గల అల్లాయ్ వీల్స్ కలవు. ముందువైపున 18-ఇంచుల అల్లాయ్ వీల్ ఉండగా వెనుకవైపున 7-ఇంచుల అల్లాయ్ వీల్ ఉంది. మరియు ఈ రెండు చక్రాలు కూడా పిరెల్లి అను స్పోర్ట్స్ టైర్లను కలిగి ఉన్నాయి.

భద్రత

భద్రత

డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2(400సీసీ) బైక్‌లో భద్రత పరంగా యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. మరియు ఈ బైక్‌లో రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లను అమర్చారు.

 సస్పెన్షన్

సస్పెన్షన్

డుకాటి స్క్రాంబ్లర్‌ సిక్ట్సి2 లో సస్పెన్షన్ కోసం వెనుకవైపున కయాబాకు చెందిన షాక్ అబ్జార్వర్‌ను మరియు ముందు వైపున ట్రెడిషనల్ షోవా టెలిస్కోపిక్ 41 యమ్‌యమ్ ఫ్రంట్ ఫోర్క్‌ను అందించారు.

ల్యాంప్స్

ల్యాంప్స్

డుకాటిలో యల్‌ఇడి రింగ్ గల గుండ్రటి హెడ్ ల్యాంప్, యల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. మరియు ఇందులో పొడవుగా గల హ్యాండిల్ బార్ ప్రత్యేకము.

ఫీచర్స్

ఫీచర్స్

గుండ్రటి స్టీల్ కోటింగ్ గల అద్దాలు, యల్‌సిడి డ్యాష్ బోర్డ్ మరియు నల్లటి సైలెన్సర్ ఇందులో ఉన్నాయి.

లభించు రంగులు

లభించు రంగులు

డుకాటి స్క్రాంబ్లర్‌ సిక్ట్సి2 బైకు మూడు విభిన్న రంగుల్లో లభించును అవి:

  • అటామిక్ టాంగేరిన్
  • ఓషియన్ గ్రే
  • షైనింగ్ బ్లాక్
  • ఫ్యూయల్ ట్యాంక్

    ఫ్యూయల్ ట్యాంక్

    డుకాటి స్క్రాంబ్లర్‌ సిక్ట్సి2 బైక్‌లో 14-లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంకు కలదు. ఈ ఇంధన ట్యాంకు మీద డుకాటి యొక్క డెడికేటెడ్ లోగో ముద్రించబడి ఉంది.

    ధర

    ధర

    డుకాటి స్క్రాంబ్లర్‌ సిక్ట్సి2 ధర సుమారుగా 7,990 యూరోలు మన భారతదేశపు రుపాయల్లో దీని ధర రూ. 5.64 లక్షలు ఉంటుంది.

    2016 ఢిల్లీ ఆటో ఎక్స్‌-పో

    2016 ఢిల్లీ ఆటో ఎక్స్‌-పో

    డుకాటి తన అత్యంత ఖరీదైన స్క్రాంబ్లర్‌ సిక్ట్సి2 మోటార్‌ బైక్‌ను 2016 ఢిల్లీ జరగనున్న ఆటో ఎక్స్-‌పోలో ప్రదర్శించనుంది.(EICMA) మోటార్ షో లేదా మిలాన్ మోటార్ షో ప్రదర్శనలో ఉన్న మరిన్ని కొత్త వాహనాల గురించి డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.

    వీడియో

    డుకాటి స్క్రాంబ్లర్‌ సిక్ట్సి2 మోడల్‌కు చెందిన మరిన్ని వివరాలు ఇక్కడ గల వీడియో ద్వారా తెలుసుకోగలరు.

    మరిన్ని టూవీలర్లుకు చెందిన వార్తలు...

More from DriveSpark

Article Published On: Wednesday, November 18, 2015, 9:53 [IST]
English summary
Ducati Unveils The Most Affordable Bike In Their Lineup — A 400cc Scrambler
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+