జియస్‌ఎక్స్-ఆర్1000 కాన్సెప్ట్ బైక్‌ను పరిచయం చేసిన సుజుకి-ఫోటోలు మరియు ఇతర సమాచారం.
సుజుకి టూ వీలర్స్ తన కొత్త స్పోర్ట్స్ బైక్ జియస్‌ఎక్స్-ఆర్1000 మోడల్ బైకును 2015 మిలాన్‌లో జరుగుతున్న మోటార్ షోలో విడుదలచేసింది. అయితే ఇది చూడటానికి ఇంతకు ముందు ఉత్పత్తి చేసిన డిజైన్‌లలో ఒక దానిలా ఉందని కొందరి అభిప్రాయం. కాని ఇది పూర్తిగా కొత్తది.
సుజుకి టూ వీలర్స్ వారి జియస్‌ఎక్స్-ఆర్ స్పోర్ట్స్ బైకు గురించి మరింత సమాచారం క్రింది స్లైడరలో అందించాము...

డిజైన్
సుజుకి వారి సరికొత్త స్పోర్ట్స్ బైక్ లో బాడీ మరియు ఇంజన్‌ల మధ్య సామరస్యమైన రూపకల్పనకు సుజుకి ఇంజనీర్లు ఆజ్యం పోశారు.అంటే బాడీ డిజైన్ నచ్చడం, ఇంజన నచ్చకపోవడం అనే సమస్యే ఉండదు అన్నమాట.

స్పోర్ట్స్ బైకులకు రారాజు
దీని డిజైన్‌లో గల అన్ని మూలలను మరియు బ్రేకింగ్ సిస్టమ్ను పూర్తిగా అభివృద్ది చేశామని దీనిని రూపొందించిన ఇంజనీర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరువాత తరం సుజుకి జియస్‌ఎక్స్-ఆర్1000 బైకు అన్ని స్పోర్ట్స్ బైక్‌లకు రాజుగా ఉండనుంది అని తెలిపారు.

ఇంజన్
సుజుకి వారి జియస్‌ఎక్స్-ఆర్1000 లో అత్యంత శక్తివంతమైన 1000సీసీ, నాలుగు సిలిండర్లు గల ఇన్‌లైన్ ఇంజన్ కలదు.

పవర్ సిస్టమ్
సుజుకి ఇంజనీర్లు ఈ బైక్ ఆర్‌పియమ్ ఎక్కువగా ఉండటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇది మధ్య రకంగా మరియు ఎక్కువ ఆర్‌పియమ్ ఉత్పత్తి చేసే విధంగా దీనిని రూపొందించారు. అందువలన దీనిని పవర్ సిస్టమ్ అనిన సంభోదించారు.

ప్రత్యేకమైన ఫీచర్లు
సుజుకి ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను అందించింది. ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్ మరియు ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఇందులో కల్పించింది.

ఛాసిస్
ప్రతి స్పోర్ట్స్ బైక్‌కు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం స్థిరత్వం. అందుకోసం సుజుకి మోటార్స్ ఈ స్పోర్ట్స్ బైక్‌లో గల ఛాసిస్ మరియు స్వింగ్ ఆర్మ్‌తో బిగించి ఉంచారు. స్వింగా ఆర్మ్ అనగా ఇంజన్ క్రింద ఇంజన్‌కు సపోర్ట్ ఒక ఫ్రేమ్ ఉంటుంది దానినే స్వింగ్ ఆర్మ్ అంటారు.



Click it and Unblock the Notifications








